రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త పీకే స‌ల‌హాలు కేసీఆర్ తీసుకుంటున్నాడ‌ని తెలిసిన నాటి నుంచి సోష‌ల్ మీడియాలో దీనిపై విస్త్రృత ప్ర‌చారం జ‌రుగుతోంది. అత‌నో హీరో అయిపోయాడు. కేసీఆర్ జీరో అయిపోతున్నాడు. భీమ్లానాయ‌క్ సినిమాలో ప‌వ‌న్‌కు ధీటుగా రానా యాక్టింగు ఉండ‌టంతో అస‌లు హీరో ఎవ‌రు.. అనే చ‌ర్చ మొద‌లైన‌ట్టు.. ఇక్క‌డా పీకేకు మ‌రీ ప్ర‌యార్టీ ల‌భించ‌డంతో .. అత‌ని వ‌ల్లే టీఆరెస్ మ‌రోసారి అధికారంలోకి రానున్న‌ద‌నే లెవ‌ల్లో బిల్డ‌ప్ ఇవ్వ‌డంతోనే స‌మ‌స్యంతా వ‌చ్చి ప‌డింది. మొన్న మల్ల‌న్న సాగ‌ర్‌కు ప్ర‌కాశ్ రాజ్‌ను తీసుకుని వెళ్లిన పీకే హంగామా చేశాడు. ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మీడియాలో వార్త‌లు కుమ్మేశారు.

ఇక మ‌రింత‌గా సోష‌ల్ మీడియాలో దీనిపై రచ్చ మొద‌లైంది. బీజేపీ దీన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుని దాడి షురూ చేసింది. ష‌రా మామూలే. కానీ టీఆరెస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా దీన్ని జీర్ణించుకోవ‌డం లేదు. మా కేసీఆర్ క‌న్నా పెద్ద వ్యూహ‌క‌ర్త‌నా ఈ పీకే…? జాతీయ రాజ‌కీయాల్లో నువ్వేందో చూపించుకో.. ఇక్క‌డ నీ అవ‌స‌రం లేద‌ని బాహాటంగానే చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యేలు స‌క్క‌గా ప‌నిచేస్తే.. ఈ పీకే అవ‌స‌రం ఏముంటుండే అని మ‌రికొంద‌రు ఎమ్మెల్యేల ప‌నితీరుపై విరుచుకుప‌డుతున్నారు.

పీకేతో ప‌నిచేయించుకోవ‌డానికి కేసీఆర్ 600 కోట్లు ఇస్తున్న‌ట్టు బీజేపీ విచ్చ‌ల‌విడిగా ప్ర‌చారం చేస్తోంది. ఈ పీకే ఎంట్రీతో టీఆరెస్‌కు వ‌చ్చే లాభ‌మేమో గానీ ఇలా రెండు వైపులా దాడి మాత్రం జ‌రుగుతోంది.

You missed