ఆస‌రా పింఛ‌న్లు కొత్తవి సాంక్ష‌న్ కాక ఏళ్లు గ‌డుస్తుంది. ప్ర‌తి నెలా కొత్త ద‌ర‌ఖాస్తులు వ‌స్తూనే ఉన్నాయి. పింఛ‌న్‌కు అర్హ‌త సాధించి.. ప్ర‌భుత్వం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డ‌మే త‌రువాయి.. వాళ్ల‌కు పింఛ‌న్ రావాలి. కానీ ఇంత వ‌ర‌కు అతీగ‌తీ లేదు. మూడేండ్లు నిండినా కొత్త వాటికి మోక్షం లేదు. పాత పింఛ‌న్లు మాత్రం త‌గ్గుతున్నాయి. చ‌నిపోయిన వారిని తొల‌గించేస్తున్నారు. కానీ కొత్త వారిని మాత్రం చేర్చ‌డం లేదు. వృద్దాప్య‌, వితంతు, విక‌లాంగులు, బీడీ కార్మికులు.. కొత్త‌గా 57 ఏండ్లు నిండిన వారు….. మొత్తం 10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆస‌రా పింఛ‌న్లు పెండింగ్‌లోనే ఉన్నాయి.

ఈ బ‌డ్జెట్ త‌ర్వాత‌నైనా వీటికి మోక్షం ల‌భిస్తుందని అనుకుంటున్నారు. అధికారులు మాత్రం కొత్త‌గా వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు ఎంక్వైరీ చేసి ఓకే చెబుతున్నారు. ఆ ఫైలు ప్ర‌భుత్వానికి పంపుతున్నారు. అవి అక్కడే అట‌క మీద భ‌ద్రంగా ఉన్నాయి. ప‌ట్టించుకునే వారు లేరు. పాత జీవో ప్ర‌కారం అర్హులైన పింఛ‌న్ దారులు 3,50 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు ఉండ‌గా.. 57 ఏ్‌ళ్లు నిండి వృద్దాప్య పింఛ‌న్ల‌కు అర్హులైన‌న వారు 7,50 ల‌క్ష‌ల మంది ఉన్నారు.

You missed