హుజురాబాద్‌లో ఎస్సీ ఓట్లు ఎవ‌రి ఖాతాలో ప‌డ‌నున్నాయి. త్వ‌ర‌లో ఇక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌లో గెలుపు కోసం కేసీఆర్ ఎంతో శ్ర‌మ‌కోరుస్తున్నాడు. గతంలో ఏ ఎన్నిక‌కూ ఇలా క‌ష్ట‌ప‌డ‌లేదేమో..! స‌ర్వ శ‌క్తుల‌నూ ఒడ్డుతున్నాడు. అంద‌రినీ బ‌రిలోకి దింపాడు. మంత్రులంతా అక్క‌డే మ‌కాం వేశారు. ప్ర‌లోభాల‌కు అంతులేదు. అధికార దుర్వినియోగానికి లెక్క‌లేదు. అయినా ఇంకా ఏదో తెలియ‌ని భ‌యం టీఆరెస్‌కు. ద‌ళిత‌బంధు స్కీంను ఇక్క‌డే పైల‌ట్ ప్రాజెక్టుగా అమ‌లు చేశారు. అంద‌రికీ ఇస్తామ‌న్నారు. ఇక ఎస్సీ ఓట్ల‌న్నీ గంప గుత్త‌గా టీఆరెస్‌కే అనుకున్నారంతా. ఇప్పుడు కొత్త‌గా అక్క‌డ స‌మీక‌ర‌ణ మారింది.

బీఎస్పీ నేత ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్ ఇవాళ ఆర్ క్రిష్ణ‌య్య‌తో క‌లిసి మంత‌నాలు జ‌రిపాడు. ముదిరాజ్ బిడ్డ అయిన ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడ‌గొట్టేందుకు ఇంత‌లా శ్ర‌మించాలా? ఆయ‌న‌కు మేం తోడుగా ఉంటామ‌నే అభిప్రాయాన్ని ప్ర‌వీణ్‌కుమార్ వెలిబుచ్చాడు. అంటే బీఎస్పీ అక్క‌డ బ‌రిలో ఉండ‌టం లేద‌న్న‌మాట‌. ద‌ళిత‌, బ‌హుజ‌నుల నినాదం అందుకున్న ప్ర‌వీణ్‌కుమార్‌.. ఈ ఎన్నిక‌లో నిల‌బ‌డి అన‌వ‌స‌రంగా ప‌రువు తీసుకునే బ‌దులు.. ఈట‌ల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డ‌మే స‌ముచితంగా ఉంటుంద‌ని భావించాడు. ఆర్ క్రిష్ణ‌య్య‌తో క‌లిసి ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఇప్పుడు హుజురాబాద్‌లో ఇటు బీసీకార్డుతో పాటు ద‌ళిత కార్డు కూడా ఈట‌ల‌కు ప్ర‌ధానంగా క‌లిసిరానుంది. ఎన్నిక‌కు ఎప్పుడు నోటిఫికేష‌న్ వస్తుందో తెలియ‌దు. కానీ స‌మీక‌ర‌ణాలు అక్క‌డ రోజు రోజుకు మారుతున్నాయి. ఎవ‌రి బ‌లాబ‌లాలేందో తేలిపోతున్న‌ది.

https://youtu.be/hKjalNNiZ-U

 

You missed