ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 57 ఏండ్లకే కుదించడంతో వీటిని పొందేకు చాలా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఆగస్టు నెలాఖరుతో దరఖాస్తులకు చివరి తేదీ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 7,37,471 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ పరిధిలో 58,546 దరఖాస్తులు రాగా ఆ తరువాత నిజామాబాద్ 46,364 దరఖాస్తులతో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఆగస్టు 30 తేదీ వరకు 6,26,333 దరఖాస్తులు రాగా చివరి తేదీ ఒక్కరోజే 1,11,138 దరఖాస్తులు రావడం గమనార్హం.
ఈ దరఖాస్తుల పరిశీలన కోసం, అర్హుల ఎంపిక కోసం అధికారులు డోర్ టు డోర్ సర్వే చేయనున్నారు. ఆ తర్వాత ఎంపిక జాబితాను ప్రభుత్వానికి జిల్లాల వారీగా నివేదిస్తారు. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ పాత హామీ అమలుకు నడుము బిగించింది. దరఖాస్తుల కార్యక్రమ స్వీకరణతో ఒక అడుగు ముందుకు పడింది. ఈ పింఛన్ల అమలు ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు. ప్రభుత్వమైతే దరఖాస్తులు స్వీకరించి పెట్టుకున్నది.
