ఆంధ్ర రాజకీయాలపై తెలంగాణ ప్రజల ఆసక్తి తగ్గింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అక్కడ జరిగే రాజకీయ పరిణామల కరెంట్‌ ఎఫైర్స్‌పైనా శ్రద్ద తగ్గింది. ఒక్కసారిగా స్కిల్ స్కామ్‌ పేరిట చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం… ఆ తర్వాత రిమాండ్‌ అంశాలను ఆంధ్రా మీడియా ‘నరాలు తెగే ఉత్కంఠ’ అని చెప్పే ప్రయత్నం చేసినా ఇక్కడెవరూ పట్టించుకోలేదు. వాళ్లు వాళ్లు తన్నుకు చస్తారు మనకేందిలే అనే చందంగానే సరిపెట్టారు తప్ప.. దీన్ని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు.

తెలంగాణ సెటిలర్లు కూడా దీనిపై పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. చర్చ తీయలేదు. తెలంగాణ ప్రింట్‌ మీడియా లైట్‌ గానే తీసుకున్నది ఈ వార్తను. నమస్తే తెలంగాణలో అసలే ప్రయార్టీ ఇవ్వలేదు. రెండో పేజీకి చిన్న ఐటెం వార్తగా ప్రచురించి వదిలేసింది. వెలుగులో కూడా అంతే. దిశ అయితే మరీ చిన్నగా… ఇలా రాజకీయంగా ఆంధ్ర వార్తలతో మాకేం సంబంధం అన్నట్టుగానే ఈ ప్రింట్‌ మీడియా వ్యవహరించింది. వాస్తవంగా నమస్తే తెలంగాణలో పెద్దగా ఈ వార్త వస్తుందని అంతా అనుకున్నారు. కానీ కేసీఆర్‌ వాయిస్‌గా ‘నమస్తే’ను చెప్పుకుంటారు. తెలంగాణ వ్యతిరేకి అయిన బాబు అరెస్టును ప్రధానంగా ప్రచురించి ఇప్పుడు లాభం లేదనుకున్నది ఆ యాజమాన్యం. బీఆరెఎస్‌ పార్టీ. ఇది జగన్, చంద్రబాబు రాజకీయ వ్యవహారంగానే చూడాలనే ఉద్దేశ్యంతో తమకు, రాష్ట్రానికి సంబంధించేది, చర్చిందేది కాదు ఈ వార్త అనే టైప్‌లోనే ఇవి వ్యవహరించాయి. బీఆరెస్‌ శ్రేణులూ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎక్కడా చర్చకు కూడా తీసుకురాలేదు.

You missed