దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

కేసీఆర్‌ మరీ ఇంతలా దిగజారుతాడని అనుకోలేదబ్బా….! ఎంత పార్టీని బతికించుకోవాలనుకున్నా ఇంతలా తప్పుడు ఆరోపణలు తప్పవని డిసైడ్‌ కావడమే విషాదమే నోయ్‌..!! ఇదే ఇప్పుడు అంతటా వినిపిస్తున్న చర్చ. 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని ఆయన చెప్పడం మరీ హాస్యాస్పదం కాకమరేమిటి..? ఉన్నవారినే కాపాడుకోలేకపోయావు. పోతేపోని అన్నావు. డోంట్‌ కేర్‌ అన్నావు. పార్టీని అడుగు పట్టించావు. ఇప్పుడు నీ దగ్గరికి ఎవరొస్తారు కేసీఆర్‌. మరీ ఇంతలా దిగజారాలా..? ఇంత దివాళాకోరు రాజకీయాలు నీ నుంచి ఆశించలేదు కేసీఆర్‌… అని అనుకుంటున్నారంతా.

మోడీ ప్రభుత్వాన్ని పడగొడతాడంట. అంటే నీలాగా నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలనంతా గుంజాలంటావు అంతే కదా. సరే రేవంత్‌ అదే పనిలో ఉన్నాడు. నిన్ను మించిన ఘనుడు రేవంతుడు. ఇద్దరు ఒకే తాను ముక్కలే. ఏంటీ… పదకొండు సీట్లు గెలుస్తావా..? ఒక్కటి గెలిచి చూడు చూద్దాం. నీ అహంకారం ముందు నీ ఇంటి అటకమీద పెట్టి రోడ్డు షోలు చేయి.. ప్రజల ముందు ముక్కు నేలకు రాయి.. అప్పుడు గానీ నిన్ను క్షమించేలా లేరు ప్రజలు. పార్టీ ఓడినా బుద్దిరాలేదా కేసీఆర్‌ అని తిట్టిపోస్తున్నారంతా.

ప్రభుత్వం పడిపోతుందంటూ ఓ అస్తిరత భావాన్ని ప్రజల్లో నింపి పరోక్షంగా నువ్వు బీజేపీకి బలం చేకూర్చే విషయం ప్రజలకు తెలుసు. బిడ్డె కవిత అరెస్టుపై ఇంతకాలానికి గానీ నోరు రాలేదా..? అవునూ.. బిడ్డనే మోడీ ఎందుకు అరెస్టు చేయాలి..? నిన్నో, కేటీయార్‌నో చేయొచ్చు కదా. పాపం ఆడబిడ్డే దొరికిందా…? నువ్వు నీ అబద్దాలు.. ఎవరూ నమ్మేలా లేరు కేసీఆర్‌. ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను చూస్తారంటున్నావ్‌… ఉద్యమకారులను ఎప్పుడైనా పట్టించుకున్నావా..? నీతో రేపు రోడ్డు షోలో ఎంత మంది ఎంత ఉత్సాహంగా పాల్గొంటారో అది చూసుకో ముందు.. అవి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

You missed