ఢిల్లీ లిక్కర్‌ కేసులో తనతో సుఖేశ్‌ వాట్సాప్‌ చాటింగ్‌ చేశాడు. డబ్బుల పంపకం జరిగిందని రిలీజ్‌చేసిన లేఖను తెలుగు మీడియా కళ్లకు అద్దుకుని మరీ పతకా శీర్షికన ప్రచురించి జబ్బలు చరుచుకుంది. ఆ మరుసటి రోజు కవిత ఇదంతా ఫేక్‌. అతనికీ నాకు పరిచయమే లేదు. అనవసరంగా మీడియా అత్యుత్సాహం చూపుతున్నదని … దమ్ముంటే నేనిచ్చిన వివరణ కూడా అదే పతాక శీర్షికన వేయాలంటూ ఆమె నిన్న విడుదల చేసిన ప్రెస్‌నోట్‌ ప్రాధాన్యత సంతరించుకుకున్నది. కానీ అనుకన్నది అనుకున్నట్టే జరిగింది. ఏ మీడియా కవిత ప్రెస్‌నోట్‌ వివరణను పెద్దగా పట్టించుకోలేదు. ఆ లెక్కన చూస్తే.. ఎప్పుడూ కవితను టార్గెట్‌ చేస్తూ పతాక శీర్షికన ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఆమె ప్రమేయం ప్రధానంగా ఉంటుందని డైలీ సీరియల్‌గా రాసుకంటూ వస్తున్న దిశ మీడియా మాత్రమే ఫ్రంట్‌ పేజీలో కాస్తా ప్రయార్టీ ఇచ్చి ప్రచురించింది.

ఇక నమస్తే తెలంగాణ అయితే మరీ దారుణం. లోపలెక్కడో పడేసింది. చిన్న వార్తగా. ఇక మిగిలిన మీడియా పరిస్తితి కూడా అంతే. ఏదో ఒక మూల చిన్నగా రాసి వదిలేశారు. అసలు మీడియాను ఇలా కవిత అడగటమే వేస్ట్. మీడియాను ఇన్ని రోజులు ప్రభుత్వం పట్టించుకోలేదని అక్కసు, కోపం, తీవ్ర అసంతృప్తి అన్నీ ఉన్నాయి. మీడియాను అధికార టీఆరెస్‌ పార్టీ గుప్పెట్లో పెట్టుకుందని, తమకు నచ్చినట్టు రాయించుకుంటుందని, అంతా వారికి దాసోహం అయ్యారనే ప్రచారమూ ఉంది. ఈ క్రమంలో కవిత మీడియా స్వేచ్చ, దుర్వినియోగం పై మాట్లాడటం కూడా వాళ్లు లైట్‌గా తీసుకున్నారు.

ఇన్నాళ్లూ తమను పట్టించుకోలేదు. ఉద్యోగ భధ్రత లేదు. రక్షణ లేదు. అసలు తమకు ఆత్మగౌరవమే లేకుండా చేశారు… అనేది మీడియా ప్రతినిధుల ఫీలింగ్‌. ఇది సరిపోదంటూ కవిత.. ఎడాపెడా మీడియాను తిట్టడంతో వారి ఇగో మరింత హర్ట్‌ కావడం తప్పితే వారిలో పరివర్తన వస్తుందనుకోవడం పొరపాటు. వేస్ట్‌ ప్రక్రియ. ఆ మాట్లాడే విధానమేదో మరింత మంచిగా, సుతిమెత్తగా , హుందాగా మాట్లాడి ఉంటే బాగుండేది. కవిత ఎంత చెప్పినా మీడియా మాత్రం పట్టించుకోవడం లేదు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఆమె ప్రమేయం ప్రత్యక్ష, పరోక్షంగా ఉందనే నమ్ముతున్నది. అలాంటి ఏ చిన్న వార్తలొచ్చినా కళ్లకు అద్దుకుని రాసేసుకుంటున్నాయి. ఇది కేవలం కవిత మీద కోపమే కాదు.. ఆ కుటుంబం మొత్తం మీద కోపం. ప్రభుత్వం మీద మీడియా వ్యతిరేకత. కేసీఆర్‌ మీద అసహనం. అసంతృప్తి. మొదటి దీన్ని సరిదిద్దు కోవాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు… ఇక్కడ మీడియా మిత్రులతోనే సరిగా లేని కేసీఆర్‌… ఆ కుటుంబం… దేశ వ్యాప్త మీడియాను ఎలా ఆకర్షిస్తారు. ఆలోచించాల్సిన విషయమే.

You missed