ఖజానాపై ఉచిత హామీల భారం మామూలుగా లేదు. దళితబంధు పెండింగ్‌… బీసీ బంధు మధ్యలో బందు, గృహ లక్ష్మీకి బ్రేక్‌… కారణం కోడ్‌ పడిందని. కానీ నిధలు లేమి ఈ పథకాలను ముందుకు సాగించేలా లేవు. అందుకే కోడ్‌ పడే వరకు వాటిని ఆపి.. ఇప్పుడు మళ్లీ గవర్నమెంటు వస్తే ఇస్తాం అనే రేంజ్‌కు పడిపోయింది కేసీఆర్‌ సర్కార్‌. రుణమాఫీ కూడా అంతే. ఎప్పుడో చేయాల్సిన రుణమాపీ ఇంకా కాలేదు. ఇప్పటి వరకు సగం మంది రైతులకే రుణమాఫీ అయ్యింది.

ఇంకా సగం మంది రైతులు.. అంటే దాదాపు 8 లక్షల మంది రైతులు ఈ రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎలాగైనా రుణమాఫీ జరుగుతుందని అంతా భావించారు. కానీ వాళ్ల ఆశలు అడియాశలే అయ్యాయి. రుణమాఫీపై కనీసం కేసీఆర్‌ మాట కూడా మాట్లాడకపోవడంతో ఇప్పట్లో రుణమాఫీ జరిగేలా లేదనే విషయం రైతులకు తెలిసిపోయింది. దీంతో ఎన్నికల్లో ఈ రైతుల నుంచి బీఆరెస్‌కు దెబ్బ పడేలా ఉంది. దీనిపై ఏమీ చేయాలని నిస్సహాయ పరిస్థితిలో కేసీఆర్ ఉన్నాడు. ఇప్పటికిప్పుడు ఏడెనిమిది వేల కోట్లు తెచ్చి రుణమాఫీ చేసేలా లేడు.

You missed