రైతుబంధు, దళితబంధు నిలిపివేయాలని రేవంత్‌రెడ్డి ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాయడాన్ని బీఆరెస్‌ తనకు అనుకూలంగా మలుచుకుంది. దీనిపై కాంగ్రెస్‌కు ప్రజా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. దీంతో దీన్ని జనాల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడానికి బీఆరెస్‌ నిరసనలకు పిలుపునిచ్చింది. కేటీఆర్‌ గురువారం పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని పిలుపునివ్వడంతో కామారెడ్డిలో రేవంత్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

రైతులను, దళితులను ఈ నిరసన కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని బీఆరెస్‌ భావిస్తోంది. నోటికాడికొచ్చిన కూడును గుంజేసుకున్నచందంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తున్నదనే విషయం జనాల్లోకి బాగా వెళ్లేలా దీన్ని బీఆరెస్ ప్రచార అస్త్రంగా మలుచుకుంది. కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో పడేసేందుకు ఆపార్టీకి దొరికిన చక్కని అవకాశంగా దీన్ని వాడుకునేందుకు రెడీ అయ్యింది.

You missed