నిజామాబాదులో ఈనెల 3 న జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ సభ నిర్వహిస్తున్న కారణం ఏదైనా పసుపు బోర్డు అంశంతో మాత్రం ముడి పడిపోయింది. ప్రధాని సభను ఆర్మూర్ లో నిర్వహించి పసుపు బోర్డు పై ప్రధానిచే మాట్లాడించే వ్యూహంలో బిజెపి ముఖ్యంగా అరవింద్ టీం ఉన్నట్లు జరిగిన ప్రచారం తో ప్రధాని సభకు పసుపు బోర్డు అంశానికి ముడిపడి చర్చలు, విశ్లేషణలు రైతుల్లో జరుగుతున్నాయి. ఆర్మూర్ లో సభ నిర్వహిస్తే బోర్డు పై స్పష్టతనివ్వడం మాండేటరీగా మారుతుందన్న ఆలోచనలతో సభను ఆర్మూరు నుంచి నిజామాబాద్ కు మార్చారనే విమర్శలు సభకు ముందే చోటుచేసుకున్నాయి. ఇలా జిల్లాలో ప్రధాని మోదీ సభ తలపెట్టిన నుంచే ప్రధానికి పసుపు బోర్డుకు ముడిపడి ప్రాధాన్యతగా చర్చ జరుగుతున్నది.

ఇదిలా కొనసాగుతుంటే ప్రధాని సభ వేళ పసుపు బోర్డు పై సాధన కమిటీ ఇప్పటివరకు స్పందించకపోవడంతో కమిటీ వైఖరి పట్ల పసుపు రైతులు ఒకింత ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే సభ లో పసుపు బోర్డుపై ప్రధాని మాట్లాడతారా లేదా.. ఒకవేళ మాట్లాడితే హామీ దిశగా మాట్లాడుతారా ? లేక అరవింద్ చెప్పుకుంటున్నట్లు అంబాసిడర్ కారు కంటే బెంజ్ కారు లాంటి బోర్డును ఆల్రెడీ ఇచ్చేసాము అని అరవింద్ ను సమర్థిస్తారా ? ఇవేమీ కాకుండా బోర్డు ఏర్పాటు కోసం బిల్లు పెట్టే ప్రక్రియ దిశగా ఏమైనా స్పష్టతగా చెబుతారా అనేది చూసాకే తగిన నిర్ణయం తీసుకోవాలని వేచి చూసే వ్యూహంలో సాధన కమిటీ ఉందని సమాచారం.

కమిటీలో రాజకీయపక్షాల నుంచి ఉన్నవారు ఈ తరహా వ్యూహాన్ని ప్రతిపాదిస్తుంటే..సభ ముగిశాక, సభలో పసుపు బోర్డు ఏర్పాటు అంశంపై సానుకూల పరిణామాలు ఏమీ లేవని తెలిశాక తీసుకునే కార్యాచరణ రోడ్డెక్కి విమర్శించే కార్యక్రమమే అవుతుంది తప్ప రోడ్డెక్కి నిరసించే కార్యక్రమం కాబోదనేది కమిటీలో ప్రజాసంఘాల, వామపక్షాల ప్రతిపాదనగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ ఈ చర్చంతా వారి మధ్య ఒక సమావేశంగానో, లేక ఒక వేదికగానో మాత్రం జరగలేదనేది రైతుల్లో తాజాగా మొదలవుతున్న చర్చ.

You missed