తెలంగాణలో బి ఆర్ ఎస్ విపక్షాలైన బిజెపి గ్రాఫ్.. కాంగ్రెస్ గ్రాఫ్దోబూచులాటలో ప్రస్తుతం సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న రకరకాల విశ్లేషణల ప్రకారం బిజెపి గ్రాఫ్ తగ్గిందనే వార్తల సమాచారమే ఈమధ్య ఎక్కువగా ఉంటున్నది. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి రాష్ట్ర అధిష్టానమైన, జాతీయ అధిష్టానమైనా తెలంగాణలో వేసే ప్రతి అడుగు, చేపట్టే ప్రతి కార్యక్రమం, నిర్వ హించే ప్రతి బహిరంగ సభ ప్రజల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తున్నది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఉంటున్నది అంటే ఆ చర్చ ఆసక్తికరంగానే ఉంటుంది.

ఇలాంటి కీలక రాజకీయ పరిణామాల మధ్య, మరి ముఖ్యంగా బిజెపి గ్రాఫ్ తగ్గిందనే ప్రచార సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో.. నొక్కి చెప్పాలంటే ఎన్నికలు రెండు మూడు నెలల్లో జరిగే తెలంగాణ రాష్ట్రంలో .. ఇంకా చెప్పాలంటే బిజెపి పార్టీ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ సొంత జిల్లా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరో మూడు రోజుల్లో ( అక్టోబర్ 3 న ) జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ రాక కార్యక్రమం ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తున్నది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ ఆసక్తి నిజామాబాద్ జిల్లాలోనే ఉంది.. తెలంగాణ రాష్ట్రంలో లేదు.. కానీ బిజెపి సెంట్రల్ లో ఉంది. ,.. ఇది ఇప్పుడు బిజెపి పార్టీ జాతీయస్థాయి ఆలోచనల్లో, గా బిజెపి పర్టికులర్‌గా జాతీయ ట్రబుల్ షూటర్స్ లో కీలకమాత్రగా మారిందట. తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి హైదరాబాద్ ను దాటిన తర్వాత జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మైలేజీ ఇచ్చిన అంశం పసుపు బోర్డు. బిజెపి పార్టీకి చెందిన కీలక అగ్రనేతలు రాజ్ నాథ్ సింగ్, అటు ఆర్ఎస్ఎస్, ఇటు బిజెపి ఇమేజ్ స్థాయిలో ఉన్న రామ్ మాధవ్ లాంటి అగ్ర నేతలు గత లోక్‌సభ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, పసుపునకు మద్దతు ధర ఇస్తామని ఎన్నికల హామీగా ప్రకటించారు.

దీనికి తోడు లోక్‌సభ గత ఎన్నికలు జరిగిన సందర్భంగా నిజాంబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తీసుకొస్తానని, లేనట్లయితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో కనివిని ఎరుగని సరికొత్త విధంగా బాండ్ పేపర్ పై హామీ ఇచ్చి మరీ రైతుల నమ్మకాన్ని చూరగొని గెలిచాడు. ఆడ తర్వాతే సీనూ, సినిమా మారిపోయాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పసుపు బోర్డు ఇవ్వలేదు. పసుపు బోర్డు ఇస్తున్నట్టు పార్లమెంటులో గాని, కేంద్ర ప్రభుత్వం గానీ ఎక్కడ ఎప్పుడు ప్రకటించలేదు. సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి పసుపును ప్రత్యేక పరిచి దానికి బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు పార్లమెంటులో సవరణ చేసి మరీ స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది.

చట్టబద్ధంగా జరగాల్సిన ఇంత పెద్ద ప్రక్రియ జరగలేదు కదా కనీసం దాని ఊసే లేకుండా ఏకంగా పసుపు బోర్డును మించిన దానిని తెచ్చానని, నాలుగు సంవత్సరాల పాటు పసుపు.. బోర్డు.. బెంజి.. అంబాసిడర్.. కారు.. డీలక్సూ, ఆర్డినరీ, రైతులు తక్కువ అడిగారు.. నేను ఎక్కువ తెచ్చాను …అంటూ పసుపు బోర్డు బిజెపి వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. ఎన్నికలు దగ్గరపడ్డాయి. పసుపు బోర్డు మాట ఎత్తితే మనల్ని నమ్ముతారా అనే సందర్భం బిజెపిలోనే నెలకొంది. చెప్పక తప్పదు. ఇలాంటి లో గ్రాఫ్ అరవింద్ వల్లనే వచ్చింది అనే అంతర్గత గుసగుసలు బిజెపిలో కొనసాగుతున్నాయి. ఇటువంటి స్థితిలో ఆర్మూర్లో బహిరంగ సభ ఏర్పాటు చేసి పసుపు బోర్డుపై హామీ ఇప్పించి బాండ్ పేపర్ వ్యతిరేకత నుంచి బయటపడాలని అరవింద్ టీం వేసిన ఎత్తుగడని జిల్లాలో, రాష్ట్రస్థాయిలో బిజెపి పెద్ద పెద్ద తలలు పసిగట్టి ప్రధాని సభను ఆర్మూర్ నుంచి నిజామాబాదుకు మార్పించాయని ప్రచారం జోరుగా సాగుతున్నది. రేపటి ఎన్నికల్లో దేశంలో బిజెపిని ముందుకు తీసుకెళ్లాల్సిన మొదటి కర్త ,కర్మ, క్రియ అయిన నరేంద్ర మోడీకి ధర్మపురి అరవింద్, రాజ్ నాథ్ సింగ్, రామ్ మాధవ్ విఫల హామీల సెగ తగిలేలా పసుపు బోర్డు ఏంటి ? ఆర్మూర్ సభ ఏంటి అనే తిరుగుబాటు ధోరణి నెలకొనడంతోనే ప్రధాని సభ జిల్లా కేంద్రానికి మారినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ అంశంతో పాటు ప్రధాని సభ వేళ జిల్లా బిజెపిని కలవరపరుస్తున్న కష్టకాలం వచ్చి పడిందా… జిల్లా స్థాయిలో బలమైన, ఆర్థిక, సామాజిక వర్గ బలం ఉన్న బిజెపి నాయకుడు ప్రధాని సభ వేళ టిఆర్ఎస్ తీర్థం కొట్టుకోవడానికి రంగం సిద్ధమైంది అనే ప్రచారం జరుగుతున్నది.

You missed