కర్ణాటక విజయ మంత్రాన్ని తెలంగాణ పై ప్రకటించింది కాంగ్రెస్‌. తుక్కుగూడలో కాంగ్రెస్‌ విజయభేరీ సభలో సోనియాతో కీలకమైన మూడు హామీలను ప్రకటింపజేశారు. మహాలక్ష్మీ పథకం కింద ప్రతీ ఇంటి మహిళకు రూ. 2500 ఆర్థిక సాయంతో పాటు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం.. గ్యాస్‌ సిలిండర్‌ ఐదొందలకే. మహిళలను టార్గెట్‌ చేస్తూ కర్ణాటక విజయ మంత్రాన్ని అనుభవంలోని తీసుకుని సోనియా చేత ఈ పథకాలు ప్రకటింపజేసి ఆమెను పంపేశారు. ఆ తర్వాత తెలంగాణ పథకాల కాపీ కొనసాగింది. అంతకు మించి అన్నట్టుగా ఇక్కడి పథకాలకు అదనంగా కొంత జోడించి తమ మ్యానిఫెస్టోలో ప్రకటింపజేసింది కాంగ్రెస్‌.

కౌలు రైతులకు కూడా మేలు జరిగేలా రైతు భరోసా పథకం ఆ పార్టీకి కొంత ఊపు తెచ్చింది. ఏడాదికి రైతుకు రూ. 15వేలు ఇస్తామన్నారు. ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం.. ఇళ్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా ఆ పార్టీకి బలం తెచ్చేవిగా ఉన్నాయి. కర్ణాకట విజయం ఆ పార్టీకి వెయ్యేనుగుల బలాన్నిచ్చిందని చెప్పడానికి సోనియా అక్కడి విజయ పథకాల ప్రకటన ఇక్కడ కూడా మ్యాజిక్‌ చేస్తుందని నమ్మారు. అంతే. అవే పథకాలు ఎక్కువగా పార్టీకి ఉపయోపడతాయని కూడా భావించారు. విమర్శలకు తావివ్వకుండా హామీలకు సోనియా ప్రసంగం పరిమితమయ్యింది. ఆ తర్వాత ఖర్గే కూడా రైతు భరోసా ప్రకటించి బీఆరెస్‌పై విమర్శలు చేశారు.

ఈ పార్టీ బీజేపీకి బీ టీమ్‌ అని గతంలో లాగానే ఆరోపించారు. సోనియా ప్రసంగం మరింత సేపు హిందీలో కొనసాగినా బాగుండేది. కానీ ఆమె ఆరోగ్యం సహకరించని విధంగానే ప్రసంగం కొనసాగడం నిరాశనే మిగిల్చింది. ఇది చాలదంటూ మళ్లీ ఉత్తమ్‌కు అనువాదం అవకాశం ఇచ్చి తప్పు చేశారు. ఎవరూ లేనట్టుగా. మొత్తానికి కాంగ్రెస్‌ తుక్కుగూడ సభ విజయవంతమైంది. కొత్త ఊపును తెచ్చింది. ఇప్పటికే కర్ణాటక గాలితో మంచి ఊపులో ఉన్న కాంగ్రెస్‌ …అక్కడి పథకాల మంత్రాన్నే ఇక్కడా జపించడం చూస్తే తమకు విజయం తథ్యమని భావిస్తున్నది కాంగ్రెస్‌ అధిష్టానం. ఈ నెల 26న బీఆరెస్‌ మ్యానిఫెస్టోను కేసీఆర్‌ ప్రకటించనున్నారు. అవీ ఇంతకు మించి అనే రీతిలోనే ఉంటాయి. ఇక ఈ పథకాల హామీలు ఎవరిని ఎంతలా ప్రభావితం చేస్తాయో చూడాలి.

You missed