ఇందూరులో ఐటీ హబ్‌లో కొలువులు దక్కాయి. మొన్న మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 12 వేల మంది హాజరయ్యారు. పది కపెంనీలు పాల్గొన్నాయి. అయితే తమ కంపెనీలకు తగిన స్కిల్స్ ఉన్న వారికి మొదట ప్రాధాన్యత కింద సెలక్షన్స్ చేసుకన్నాయి కంపెనీలు. ఇందులో భాగంగా తొలి విడతగా 250 మందికి ఉద్యోగాలు దొరికాయి. వీరికి జాబ్ ఆఫర్స్ లెటర్స్ కూడా ఇచ్చేశారు. ఈ నెల 7న మంత్రి కేటీఆర్ జిల్లాకు రానున్నారు.
ఐటీ హబ్‌తో పాటు పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆయన రాకకు మునుపే కొత్తగా కొలువులోకి ఎక్కిన వారు తమ డ్యూటీలో జాయిన్ కానున్నారు. ఇందూరు ఐటీ హబ్ ఇక కొత్త ఆవిష్కరణలకు కేంద్రం కానుంది. ఇంటర్వ్యూలో పాల్గొన్న మిగిలిన అభ్యర్థలకు వారి వారి స్కిల్స్‌ను బట్టి తర్వలో కొలువులు దక్కేలా ప్లాన్ చేస్తున్నారు. నిజామాబాద్ లేదా హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించి రెండో విడత ఉద్యోగాలకు అవకాశం కల్పించనున్నారు. ఆ తర్వాత మరోసారి మెగాజాబ్ మేళా కూడా నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ ఇందూరు ఐటీ హబ్‌పై ప్రత్యేక నజర్ పెట్టారు.
రెండో శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించడంలో భాగంగా ఇందూరు ఐటీ హబ్ .. మహానగరాలకు ధీటుగా ఎదిగితే ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉంటుందనే భావన ఉంది. దీంతో భవిష్యత్తులో ఇందూరు ఐటీ హబ్‌కు మంచి రోజులు రానున్నాయి. లోకల్ యూత్‌కు మంచి కొలువులు స్థానికంగా దక్కనున్నాయి.