వాస్తవంగా క్షేత్రస్థాయిలో బీఆరెస్‌ పై ప్రజా వ్యతిరేకత పెరిగింది. ఏ ఏ సెక్షన్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందో సమగ్రమైన రిపోర్టను సేకరించిన కేసీఆర్‌ నష్టనివారణ చర్యలకు పూనుకున్నాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టాడు.రైతు రుణమాఫీపై రైతుల్లో తీవ్ర ఆక్షేపణ ఉండేది. బ్యాంకర్లు నానా ఇబ్బందులు పెట్టారు. దీంతో రైతుబంధు అందించిన పేరు కూడా చెడిపోయే పరిస్థితి వచ్చింది.

రైతుల ఆగ్రహం మరింత పెల్లుబుకకముందే కేసీఆర్‌ రైతు రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకున్నాడు. మొన్నటి వరకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని,ఇప్పుడు మెరుగుపడిందనే సమర్థన చేస్తూ.. గురువారం నుంచి అందరికీ రైతు రుణమాఫీ చేయాలని అధికారులకు ఆదేశమిచ్చారు. దీంతో రైతుల్లో ఊరట లభించింది. రుణమాఫీ చేస్తరా..? చెయ్యరా ..? అని అనుమానం మొన్నటి వరకు ఉండింది. ఎన్నికల వేళ కచ్చితంగా చేస్తారనే ధీమా కూడా ఉండేది.

కానీ అప్పటికే చాలా నష్టం జరిగింది. బ్యాంకర్లు తిప్పలు పెట్టారు. రైబుబంధు ఆపేశారు. రుణాలు రెన్యూవల్‌ చేయలేదు. అకౌంట్లు హోల్డ్‌లో పెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత కేసీఆర్‌ పై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా కేసీఆర్‌ తీసుకున్న రుణమాఫీపై నిర్ణయం రైతు ఆగ్రహం పై నీళ్లు చల్లినట్టయ్యింది.

You missed