ఇకపై రేషన్‌ బియ్యమే బలవర్ధకం.. పుష్టికరం… కేంద్రం నిర్ణయంతో ఇకపై రేషన్‌ షాపుల్లో ఎఫ్‌ఆర్‌కే బియ్యం పంపిణీ… శారీరక రుగ్మతలను పోగొట్టి, పరిపుష్టి ఆరోగ్యాన్నిచ్చే ఎఫ్‌ఆర్‌కే బియ్యాన్ని రేషన్‌ బియ్యంలో మిక్స్‌ చేసి పంపిణీ… మరో రెండు నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా అమలుకు రంగం సిద్దం… కేంద్రం కీలక నిర్ణయం.. గతంలో వెనుకబడిన ప్రాంతాలకే పరిమితమైన ఎఫ్‌ఆర్‌కే బియ్యం.. ఇకపై అన్ని రేషన్‌ షాపులకూ వర్తింపు… మిల్లర్లకూ కచ్చితమైన ఆదేశాలు.. ఎఫ్‌ఆర్‌కే బియ్యాన్ని అందించేందుకు మిషనరీలను కొనుగోలు చేసిన రైస్‌ మిల్లర్లు.. ధర వెచ్చించి అమ్మకాలు..

ఇకపై రేషన్‌ బియ్యమే బలవర్ధకం.. పుష్టికరం…

కేంద్రం నిర్ణయంతో ఇకపై రేషన్‌ షాపుల్లో ఎఫ్‌ఆర్‌కే బియ్యం పంపిణీ…

శారీరక రుగ్మతలను పోగొట్టి, పరిపుష్టి ఆరోగ్యాన్నిచ్చే ఎఫ్‌ఆర్‌కే బియ్యాన్ని రేషన్‌ బియ్యంలో మిక్స్‌ చేసి పంపిణీ…

మరో రెండు నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా అమలుకు రంగం సిద్దం…

కేంద్రం కీలక నిర్ణయం.. గతంలో వెనుకబడిన ప్రాంతాలకే పరిమితమైన ఎఫ్‌ఆర్‌కే బియ్యం.. ఇకపై అన్ని రేషన్‌ షాపులకూ వర్తింపు…

మిల్లర్లకూ కచ్చితమైన ఆదేశాలు.. ఎఫ్‌ఆర్‌కే బియ్యాన్ని అందించేందుకు మిషనరీలను కొనుగోలు చేసిన రైస్‌ మిల్లర్లు.. ధర వెచ్చించి అమ్మకాలు..

 

(దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి)

రేషన్‌ బియ్యమా..? అబ్బా ముక్కిపోయి… ఏదో వాసన. దొడ్డు బియ్యం.. గొంతులోకి దిగవు. మెరిగలు కూడా. పంటికింద రాళ్లు.. సామాన్యులు తినడం కష్టం. ఇలాంటి అభిప్రాయాలే ఉన్నాయి రేషన్‌ బియ్యంపై దీంతో చాలా మంది వీటిని తినడం మానేశారు. రేషన్‌ డీలర్లకో.. బయట బ్లాక్‌ దందా చేసేవాళ్లకో అమ్ముకుంటున్నారు. లేదా అలాగే వదిలేస్తున్నారు రేషన్‌ షాపుల్లోనే. రేషన్‌కార్డు ద్వారా ప్రయోజనాలు ఉంటాయనే దీన్ని ఉంచుకుంటున్నారు తప్ప.. రేషన్‌ బియ్యం తినే వారి సంఖ్య నానాటికీ తగ్గిపోతూ వస్తున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇప్పుడు రేషన్‌ బియ్యం పేదలకు ఓ వరంగా మారనున్నాయి. వారికి ఈ బియ్యం బలవర్దక ఫుడ్‌గా మారనుంది.

ఎందుకంటే ఇకపై ప్రతీ నలభై కిలోల బియ్యంలో అరకిలో ఫార్టిఫైడ్‌ రైస్‌ కర్నల్స్‌ (ఎఫ్‌ఆర్‌కే) బియ్యాన్ని మిక్స్‌ చేసి పంపిణీ చేయనున్నారు. అసలు ఈ ఎఫ్‌ఆర్‌కే అంటే ఏమిటీ..? చాలా మందికి తెలియదు. ఎఫ్‌ఆర్‌కేలో విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. వీటిని పౌర సరఫరాల శాఖ రేషన్‌ దుకాణాల ద్వారా సప్లై చేసే బియ్యంలో ప్రతీ నలభై కిలోలలకు ఓ అరకిలో వీటిని కలిపి సరఫరా చేస్తారు. దీంతో ఆ బియ్యం ఎంతో బలవర్దక ఆహారంగా తయారవుతుంది. అనీమియా… తదితర మనిషి శరీరంలో వారికి తెలియకుండానే ఉన్న ఎన్నో రుగ్మతలను ఇవి పారదోలనున్నాయి. గతంలో ఈ విధానాన్ని కేంద్రం కేవలం వెనుకబడిన మరీ పేదరికంలో ఉన్న ఏరియాల్లో, ట్రైబల్‌ ప్రాంతాలకే పరిమితం చేసి అమలు పరిచింది.

కానీ మరో నెల రెండు నెలల వ్యవధిలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్‌ షాపుల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు పకడ్బందీగా ప్రణాళికలు సిద్దం చేసింది. ఇప్పటికే సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలిచ్చింది. అయితే నాన్‌ ఎఫ్‌ఆర్‌కే బియ్యం ఇంకా రాష్ట్రంలో అక్కడక్కడా మిగిలే ఉన్నాయి. దీంతో వీటిని ముందు ఖాళీ చేసేసి ఆ తర్వాత జిల్లాల వారీగా సరిపడా ఉన్న నిలువ బియ్యంలో ఈ ఎఫ్‌ఆర్‌కే బియ్యాన్ని మిక్స్‌ చేసి పంపిణీ చేయాలని భావిస్తోంది. దీని కోసం ఓ ప్రత్యేక విభాగాన్ని పెట్టింది. వీరంతా నిబంధనల మేరకు ఎన్ని కిలోల బియ్యంలో ఎంత మోతాదులో ఎఫ్‌ఆర్‌కే బియ్యాన్ని కలపాలనేది శాస్త్రీయంగా ధృవీకరిస్తారు. ఆ తర్వాతే అవి రేషన్‌ దుకాణాలకు వెళ్తాయి. ఈ బియ్యం వండుకుని తిన్న ప్రజలకు ఎంతో ఆరోగ్యం. రోగాలు దూరం. ఇదే తరహాలో బయట రైస్ షాపులలో అమ్మేందుకు పంపే బియ్యంలో కూడా ఎఫ్‌ఆర్‌కే బియ్యాన్ని మిక్స్‌ చేయాలని కచ్చితమైన ఆదేశాలను కేంద్రం పంపింది. దీంతో రైస్‌ మిల్లర్లు ఇప్పటికే ఐదారు లక్షల విలువ చేసే ఈ ప్లాంట్లను కొనుగోలు చేసి తమ మిల్లుల్లో పెట్టుకున్నారు.

ఈ బియ్యం మిక్స్‌ చేసినందుకు దీనికి అదనంగా చార్జి వసూలు చేస్తారు. ఇప్పటికే సన్నబియ్యం ధరలు ఆకాశానికి అంటాయి. ఇక ఎఫ్‌ఆర్‌కే పేరుతో మరింత దోచుకుంటారనేది తెలియనిది కాదు. అయితే ఉచితంగా లభించే రేషన్‌ బియ్యంలో ఎఫ్‌ఆర్‌కే మిక్స్‌ చేయడం.. ఎలాంటి పాలిష్‌ లేకుండా ఉన్న బియ్యాన్ని తినడం వల్ల మంచి ఆరోగ్యం సిద్దిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక వేల రూపాయలు పెట్టి సన్నబియ్యం కోసం ఎగబడే బదులు రేషన్‌ షాపుల దగ్గర క్యూ కట్టి మరీ ఈ ఎఫ్‌ఆర్‌కే బియ్యం మిక్స్‌ చేసిన రేషన్‌ బియ్యాన్ని తినడమే అన్ని విధాలా శ్రేయష్కరం అంటున్నారు. అయితే పెద్దపల్లి తదితర ఏరియాలో ఇంకా నాన్ ఎఫ్‌ఆర్‌కే బియ్యం మిగిలి ఉన్నాయి.

వీటిని ఖాళీ చేస్తున్నారు. వివిధ జిల్లాలకు పంపుతున్నారు. ఆ ష్టాక్‌ అంతా అయిపోగానే జిల్లాల వారీగా రెడీగా ఉన్న బియ్యంలో ఎఫ్‌ఆర్‌కే మిక్సింగ్‌ ప్రాసెస్‌ జరుగుతుంది. అయితే దీనికి మరో రెండు నెలల కాలం పట్టొచ్చంటున్నారు అధికారులు. అందుకే రేషన్‌ దుకాణాల్లో బియ్యం చాలా ఆలస్యంగా వస్తున్నాయి. పెద్దపల్లి నుంచి ఈ బియ్యాన్ని డంప్‌ చేసే వరకు ప్రతీ నెల పదిహేను తారీఖు తర్వాత గానీ దుకాణాలకు రేషన్‌ రావడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు నెలలు ఇదే రిపీట్‌ కానుంది. ఆ తర్వాత జిల్లాలోనే రెడీగా ఉన్న బియ్యంలో ఎఫ్‌ఆర్‌కే మిక్స్‌ చేసి పంపిణీ చేస్తారు. ఇక వీటిని బయట అమ్ముకోవడం మూర్ఖత్వమే అవుతుంది. బంగారంలా వీటిని తెచ్చుకుని తినడమే బెటర్‌…. అలవాటు చేసుకోవాలి మరి. వేల రూపాయలు పెట్టి సన్నబియ్యం కన్నా ఇవి వంద రెట్లు మేలు.

 

You missed