సర్కార్ బడుల మీద మంచి చర్చకు తెర తీసిన హిమాన్షు కు అభినందనలు….!!!

నేను చదువుకునే టప్పుడు మేము కేవలం ప్రభుత్వ స్కూల్లలోనే చదువుకునే వాళ్ళము ఆల్మోస్ట్ జీరో ఫీజు తో….

మా టైం లో మా ఇందూరు జిల్లాలో మొత్తం మీద రెండే ప్రైవేట్ స్కూల్లు ఉండేవి ఒకటి బోధన్ దగ్గర మోస్రా లో ఇంకొకటి ఆర్మూర్ దగ్గర కిసాన్ నగర్లో…

ఇగ ఎంతటి తోపు పిల్లలైనా ఆల్మోస్ట్ సర్కార్ బడుల్లోనే చదువుకునే వారు….కానీ ఇప్పుడు…

సర్కార్ బడి లో తమ పిల్లల్ని చదివించడం అంటే అతి చిన్నతనంగా భావించే పరిస్థితి వచ్చింది…రోజూ కూలీ నాలీ చేసుకునే వాళ్ళు సుక తమ పిల్లల్ని…

వేలు/లక్షలు పోసి ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు…

ఈ పరిస్థితికి దేశంలోని ప్రతీ ఒక్క అధికారం చేసిన పార్టీ ల పాపం ఫలితమే…

విదేశాలలో ప్రభుత్వ స్కూల్లు ఎంతో గొప్పగా ఉంటుంటే… మన దగ్గర రోజురోజుకూ దిగజారిపోతున్నాయి…

తల్లిదండ్రులకు లక్షల రూపాయల నష్టం తెస్తున్నాయి….!!!

Katpally Santhosh Reddy

You missed