కాంగ్రెస్‌లో కరెంటు కార్చిచ్చు…

రేవంత్‌ వ్యాఖ్యలతో వచ్చిన గాలీ పాయే…

మూడు రోజుల నిరసనకు పిలుపునిచ్చిన కేటీఆర్‌..

ఆత్మసంరక్షణలో కాంగ్రెస్‌ శ్రేణులు.. సమర్థించుకునేందుకు యత్నం… రైతుల ఆగ్రహం…

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌కు కొంత స్పేస్‌ దొరికింది. బీజేపీ గ్రాఫ్‌ పడిపోయింది. ఇక్కడి లీడర్లు ఏమీ చేయకున్నా కాలం కలిసివచ్చి కాంగ్రెస్‌ కాస్తోకూస్తో బలం పుంజుకుందని ఆ పార్టీ శ్రేణులు సంబురపడేలోపే.. రేవంత్‌రెడ్డి మొత్తం గాలి తీసేశాడు. రైతుల ఇష్యూపై ఆతితూచి మాట్లాడాల్సింది పోయి తన వాచలత్వం చూపించి కూర్చున్న కొమ్మను నరుక్కున్నాడు. రైతుకు ఉచిత కరెంటు అవసరమే లేదన్నట్టుగా మాట్లాడాడు.

మూడు గంటలు సరిపోతుంది.. అని పెద్ద లెక్కలు తీశాడు. ఇరవై నాలుగ్గంటలు ఎందుకు..? అన్నాడు. ఇదిప్పుడు రైతులకు తీవ్రంగా ఆగ్రహం తెప్పించే ఇష్యూ అయి కూర్చుంది. దీంతో కాంగ్రెస్‌ పెద్దలు తలు పట్టుకున్నారు. ఆత్మసంరక్షణలో పడ్డారు పార్టీ శ్రేణులు. సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొందరు రేవంత్‌ ఎవరు చెప్పడానికని షరా మామూలుగా తమ విభేదాలకు మరింత ఆజ్యం పోసుకున్నారు. ఈ క్రమంలోనే బీఆరెస్‌ దీన్ని సీరియస్‌గా తీసుకున్నది.

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రేవంత్‌ వ్యాఖ్యలపై మూడు రోజులు నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం నుంచే నిరసనలు మొదలయ్యాయి. రేవంత్‌ దిష్టిబొమ్మల దహనాలు షురూ చేశారు. బుధ,గురువారాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. మరోవైపు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ లు రేవంత్‌ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటుందని భావిస్తున్న పార్టీ శ్రేణులకు ఈ పరిణామాలు మింగుడుపడటం లేదు.

You missed