నమస్తే తెలంగాణను ప్రతీ ఒక్కరు చదవాలి.. అని ఎమ్మెల్సీ కవిత మీటింగులలో మరీ ప్రత్యేకంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ పత్రిక సర్క్యూలేషన్ గురించి ఈ మధ్య సీఎం కేసీఆరే దృష్టి పెట్టారు. ఆదివారం జరిగిన సికింద్రాబాద్ బోనాల ఉత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. కానీ ఆ ఫోటో… వార్త నమస్తే తెలంగాణలో ఎక్కడా కనిపించలేదు. పత్రికలోని అన్ని పేపర్లూ తిరగేశారు. ఏ మూలకన్నా వేసుంటారేమోనని. ఉహూ.. ఎక్కడా కనిపించలే. పోనీ హైదరాబాద్ ఎడిషన్‌కే పరిమితం చేశారేమోనని అందులోనూ వెతికారు. ఏ మూలా చిన్న ఫోటో కూడా కానరాలేదు. దీంతో సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ వార్త గుప్పుమన్నది. నమస్తే తెలంగాణలో మన అక్క ఫోటో రాలేదా… ఎందుకు..? ఇంత నిర్లక్ష్యమా..? దీనికి ఎవరూ బాధ్యలు..? అంటూ మండిపడుతున్నారు జాగృతి, పార్టీ శ్రేణులు. మరోపక్క హైదరాబాద్ జర్నలిస్టు సర్కిళ్లలో కూడా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మన నమస్తే తెలంగాణలో అక్క ఫోటో రాలేదేందీ…? సికింద్రాబాద్ బోనాలకు హాజరైన కవిత ఫోటోను ప్రచురించని నమస్తే… బీఆరెస్ శ్రేణుల్లో, జర్నలిస్టు వర్గాల్లో ఇప్పుడిదే చర్చ….
ByDandugula Srinivas
Jul 10, 2023 #bharath jagruthy, #bonaalu, #brs, #cm kcr, #editor, #MLC Kalvakuntla kavitha, #namasthe telangana
Related Post
ఆ కత్తిపోట్లు కేసీఆర్ పైనే.. మాతో పెట్టుకోకు దుమ్మురేపుతం…! ప్రభాకర్‌రెడ్డిపై కత్తిపోట్లపై ఘాటుగా స్పందించిన కేసీఆర్.. బాన్సువాడ వేదికగా ప్రతిపక్షాలకు సీరియస్ వార్నింగ్… మేము తలుచుకుంటే దుమ్ముదుమ్మే… మేధావులంతా ఈ హింసాత్మక సంఘటనను ఖండించాలి..! లంగాచేతల, గుండాగిరీని తిప్పికొడతాం… పిలుపునిచ్చిన కేసీఆర్… రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఎంపీపై కత్తిపోట్ల ఘటన.. ఖండించిన సబ్బండవర్ణాలు….
Oct 30, 2023
Dandugula Srinivas