బండి మార్పు బిజెపికి ప్లస్సా… మైనస్సా…..

మెజార్టీ బీసీ పాపులేషన్ లీడర్ ను తప్పించటం వెనుక కమలం ఏo సాధించనుంది….

అధ్యక్ష మార్పు బీఆరెస్ కోసమేనా….

తెలంగాణ బీజేపీలో అధ్యక్ష మార్పు ప్రస్తుతం రాష్ట్ర పొలిటికల్ స్ట్రీట్ లో హాట్ టాపిక్ గా మారింది. బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టాక… తెలంగాణలో కమలం పార్టీ పుంజుకున్న విషయం కాదనలేనిది. దుబ్బాక, హుజురాబాద్ గెలుపుతో మరింత ఊపు వచ్చింది ఆ పార్టీకి. మరోవైపు బండి బీసీ… అందులో బలమైన మున్నూరు కాపు సామాజికవర్గం నేత. దీంతో మెజార్టీ బీసీలు కాషాయం పార్టీవైపు మొగ్గారు. బండి సంజయ్ మాస్ లీడర్ కావటంతో యూత్ లో కూడా క్రేజ్ సంపాదించారు. పాదయాత్రతో పార్టీకి మరింత మైలేజ్ తెచ్చారు. ఉన్న పలంగా పార్టీ ఆధిష్టానం బండిని కాదని కిషన్ రెడ్డిని బిజెపి స్టేట్ చీఫ్ గా నియమించటం ఇప్పుడు బీసీల్లో అంతర్మధనం మొదలైంది. బీజేపీ అగ్రవర్ణాలకే అందలం ఎక్కిస్తుందన్నది మరోసారి రుజువు చేసుకుంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా… రాష్ట్రంలో బీజేపీకి 2014 పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు గెలవడం ఒకింత ఆశ్చర్యమే….. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ ఇలా ఉత్తర తెలంగాణలో పట్టు సాధించింది. బీసీలు ఎక్కువగా ఉండే తెలంగాణలో బీసీ వర్గానికి చెందిన నాయకుడి మార్పు ఆ వర్గాల్లో నిరాశనే మిగిల్చింది. అసలే తెలంగాణలో బిజెపి గ్రాఫ్ పడుతూ వస్తోంది. కర్ణాటక ఎన్నికల రిజల్ట్ తో కమలం ఇక్కడ వాడుతూ ఉండగా…. బండి మార్పు ఆ పార్టీకి మరింత నష్టమే మిగిల్చనుందన్న వాదన మొదలైంది.

బండి మార్పు వెనుక అంతర్యమేంటి ?

కమలం పెద్దలు తీసుకున్న నిర్ణయం వెనుక కారణం ఏదైనప్పటికి… బీసీ వర్గాల్లో అసంతృప్తి మొదలైంది. అయితే ఈ మచ్చ పోయేందుకు మరో బీసీ నేత ఈటెలకు కీలక బాధ్యతలు అప్పగించే ప్లాన్ వేసింది అధిష్టానం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి తగిన మెజార్టీ రావటం కష్టమే అని భావించిన బిజెపి పెద్దలు…. రాష్ట్రంలో బలంగా ఉన్న బిఆరెస్ పార్టీకి మేలు చేయాలన్న భావనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశం స్పష్టం గా కనిపిస్తోందంటున్నారు. పార్టీకి బలం లేని చోట ప్రాంతీయ పార్టీలకు వెన్నుదన్నుగా నిలిచి కాంగ్రెస్ కు అవకాశం లేకుండా చేయాలన్న ఉద్దేశం బైటపడుతోంది. మోడీ గ్రాఫ్ పడిపోతుందన్న విషయం గ్రహించిన బిజెపి పెద్దలు భవిష్యత్ లో ప్రాంతీయ పార్టీల సపోర్ట్ అవసరం అని భావిస్తోంది. అటు ఎంపీ అరవింర్ కు కూడా తగిన ప్రాధాన్యత కొరవడింది. తాను బిసి నేత కావటమే ఇందుకు నిదర్శనమా ? కిషన్ రెడ్డి సౌమ్యుడు…. అంతగా ప్రజల్లోకి వెళ్లి ప్రభావితం చేసే నాయకుడు కాదు. ప్రెస్ మీట్లు పెట్టి మమా అనిపించే కిషన్ రెడ్డి… రాష్ట్ర ప్రజలను అంతగా ఆకర్షించగలరా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ పదే పదే బీజేపీ బి పార్టీ బీఆరెస్ అని ఆరోపిస్తున్నది నిజమేనా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి బిజెపి పెద్దల నిర్ణయాలు.

అయితే బండి మార్పు కాంగ్రెస్ కు కలిసొస్తుందా అన్న చర్చకుడా జరుగుతొంది. గతంలో బీసీలు కాంగ్రెస్ పక్షాన నిలిచారు. బలమైన కాపు సామాజిక వర్గం ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూసే అవకాశమూ లేకపోలేదు. ఎన్నికలకు 6 నెలల ముందు ఇలా అధ్యక్ష మార్పు బీజేపీకి నష్టం కలిగించే అంశమే… అంటున్నారు విశ్లేషకులు. రాజకీయాలను శాశించేది రెడ్లే అయినా…. అధిక శాతం ఓటర్లు ఉన్నది బీసీలే అన్న విషయం బిజెపి అంత ఈజీగా ఎందుకు మరిచిపోతుంది అన్న ఆలోచన ఎవరికైనా కలుగుతుంది.

You missed