యాదవులకు సంఘీభావం చెప్పరేం..?

రేవంత్‌ ఓ అహంకారి.. బీసీలంటే చులకన..

యాదవులకు క్షమాపణ చెప్పేందుకు రేవంత్‌కు అడ్డొస్తున్న అహంకారం…

కాంగ్రెస్‌ పార్టీలోనే ఆయన వైఖరిపై తీవ్ర అసంతృప్తి..

తోటి శ్రామిక కులాలకు సంఘీభావం తెలపాల్సిన బాధ్యత బీసీ సంఘాలకు లేదా..?

కొద్ది రోజులుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి యాదవులకు మధ్య వివాదం నడస్తున్నది. ఇది తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు రేవంత్‌రెడ్డికి మధ్య వివాదం కాదు. బీఆరెస్‌ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య వివాదం అంతకన్నా కాదు. రేవంత్‌రెడ్డికి యాదవ కులానికి మధ్య సాగుతున్న వివాదం. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య గొడవ జరిగితే అది కేవలం రాజకీయ గొడవ అవుతుంది. పరస్పరం తిట్టుకోవడం ఈ కాలంలో మామూలే. కానీ రేవంత్‌ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి యాదవుల వృత్తి లక్షణాలను అవమానించే విధంగా తీవ్రమైన అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు.

దీంతో తలసాని, రేవంత్‌ వివాద స్వభావం మారిపోయింది. రేవంత్‌కు, యాదవులకు మధ్య వివాదంగా మారింది. పేడ పిసకడం, దున్నపోతులను కాయడం వంటి వ్యాఖ్యలను తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను అవమానించడానికి రేవంత్‌ వాడారనేది విజువల్స్‌ చూసిన వారికి తెలుస్తూనే ఉన్నది. యాదవులు రెడ్డి కులస్తులను ఏమీ అనడం లేదు. వారి పట్ల తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. కేవలం రేవంత్‌ రెడ్డి అన్న మాటలకే తమ అభ్యంతరమని చెప్పారు. రేవంత్‌ స్వతహాగా అహంకార పూరితమైన వ్యక్తి. అందరినీ ఆదరించే స్వభావం ఆయనకు లేదు. బీసీల పట్ల చులకనగా ఉంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇప్పటికే ఆయన స్వభావం తెలిసిన వారు కనుకనే ఈ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందింస్తున్నారు. తన వ్యాఖ్యలు ఒక సామాజికవర్గాన్ని బాధపెట్టేవిగా ఉన్నాయి కనుక రేవంత్‌ ఒక మెట్టుదిగి వచ్చి క్షమాపణ చెబుతారని కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు భావించారు. కానీ రేవంత్‌కు ఆ ఉద్దేశమే లేదు. తాను యాదవులకు క్షమాపణ చెప్పడమా అనే అహంకార దోరణి ఉన్నది. తాము గాంధీభవన్‌ను ముట్టడిస్తామని, దున్నపోతులతో వచ్చి నిరసన తెలుపుతామని హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. ఒక బీసీ కులం వారిని అవమానించడమే కాకుండా వారి ఆవేదనను అర్థం చేసుకోవడానికి రేవంత్‌ సిద్దంగా లేడు. క్షమాపణ చెప్పకపోవడమే కాకుండా , ఒకరిద్దరు దళిత కులస్తులతో ఎదురుదాడి చేయించడానికి ప్రయత్నించారు.

యాదవులు తిరిగి ఎదురుదాడి చేస్తే , దానిని బీసీలకు, ఎస్సీలకు మధ్య వివాదంగా మార్చాలనే కుట్ర పన్నాడు. కానీ ఆ వ్యూహం ఫలించలేదు. తమ కులాన్ని అవమానించినందుకు బలంగా నిరసన వినిపిస్తున్నందుకు యాదవులను అభినందించాలి. కానీ ఇది ఒక యాదవులకు సంబంధించిన సమస్య మాత్రమేనా..? ఒక వృత్తిని అవమానిస్తే , ఇతర శ్రామిక కులాలన్ని ఎందుకు స్పందించకూడదు..? శ్రమ జీవులను అవమానించినప్పుడు ఇది తమ కులానికి సంబంధించినది కాదని మౌనం వహించడం ఏమిటనే విమర్శలు వినబడుతున్నాయి. బీసీలు, బహుజనులు, శ్రామికులు అంటూ రాజకీయాల కోసం నినాదాలు ఇచ్చే సంఘాలు, మేధావులు ఏమి చేస్తున్నట్టు..? ప్రతి కులానికి, వృత్తికి సంఘాలున్నాయి. ఫలానా సంఘాల వాళ్లమని, హక్కుల పోరాట సంఘమని వీరంతా పేపర్లలో ప్రకటనలు చేస్తుంటారు. మరి ఇప్పుడు వీరంతా ఎందుకు మౌనం వహిస్తున్నారు.

తోటి శ్రామిక కులానికి సంఘీభావం తెలపవలసిన బాధ్యత వీరికి లేదు. కులాలను రాజకీయాల కోసం వాడుకోవడమే తప్ప , స్వప్రయోజనాలు తీర్చుకోవడమే తప్ప నిజమైన స్వాభిమాన సమస్య ఎదురైనప్పుడు పరస్పరం సంఘీభావం తెలుపుకోవద్దా. బీసీ సంఘాలు ఇంకా ఎప్పుడు స్పందిస్తాయి? మేధావులలో ఎప్పుడు చలనం వస్తుంది. ఏ రాజకీయ నాయకుడికో, పార్టీకో పల్లకి మోయడానికి తప్ప అసలైన సమస్య వచ్చినప్పుడు స్పందించరా? పోనీ రేవంత్‌ రెడ్డి మాటల్లో తప్పేమి లేదు. ఒక కులాన్ని కించపరిస్తే తప్పేమిటి? బీసీలు పడి మౌనంగా ఉండాల్సిందే అనేది వీరి ఉద్దేశమైతే అదే విషయం బహిరంగంగా చెప్పవచ్చు. కానీ మళ్లీ రాజకీయాల కోసం కులాన్ని వాడుకోకూడదు. కానీ బీసీ సంఘాల, మేధావుల ముసుగు ధరించి ద్రోహం చేయడమేమిటనే విమర్శలు వస్తున్నాయి.

-నివాస్‌

You missed