ఈ మాష్టారు మహా స్ట్రిక్టు…

తనకు ఇన్చార్జిగా ఇచ్చిన నియోజకవర్గాల్లో వెంటపడి ఆత్మీయ సమ్మేళనాల సక్సెస్‌..

నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఇప్పటికే 60కి పైగా ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ…

ఐదు నియోజవకర్గాల్లో ఇంతలా ఆత్మయ సమ్మేళనాలు చేయడంలో ఫస్ట్‌ లిస్టులో ఈ జిల్లాలు…

వీజీగౌడ్‌తో అట్లుంటది మరి..!

వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌: 

ఆయనంతే. క్రమశిక్షణకు మారుపేరు. అధిష్టానం చెప్పింది వేదం. ఆయనకిచ్చిన బాధ్యత దైవం. ఇన్చార్జిగా ఎక్కడ నియమించినా… బాధ్యతలు ఏం అప్పగించినా బెత్తం పట్టుకుని మాస్టారు పాఠాలు చెప్పినట్టే ఉంటుంది ఆయన వ్యవహారం. అందుకే ఆయన్ను అంతా ఈ మాష్టారు మహా స్ట్రిక్టు అంటారు. మాజీ ఎమ్మెల్సీ, బీఆరెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీజీ గౌడ్‌ గురించి నేను చెప్పేది.

ఇప్పుడీ ముచ్చట మనకెందుకంటారా..?. గతంలో ఆయనకు అధిష్టానం చాలా చోట్ల పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఎంత దూరమైనా వెళ్లడం, అక్కడి లీడర్లతో కో ఆర్డినేషన్ చేసుకోవడం, కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకుని రావడం.. అధిష్టానం వద్ద తన పనితనాన్ని నిరూపించుకోవడం … అలా చేసుకుంటూ పోవడమే ఈయనకు తెలుసు. అలుపుండదు. అలసటుండదు. గమ్యమే కనిపిస్తుంది. లక్ష్యమే నడిపిస్తుంది. మరీ ఎక్కువగా చెప్తున్నాననిపిస్తుందా..? సరే ఇక్కడితో ఇది చాలిద్దాం.

అసలు విషయానికొద్దాం. ఆత్మీయన సమ్మేళనాలు నిర్వహించే క్రమంలో కొందరి నేతలకు కొన్ని జిల్లాలకు ఇన్చార్జిలుగా నియమించారు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. వీజీ గౌడ్‌కు నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాలు అప్పగించారు. ఇక ఆనాటి నుంచి ఈయన పని వారి వెంటపడటమే. ఓ వైపు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మరోవైపు మిగిలిన నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు… వీరందరితో టచ్‌లో ఉండటం.. తర్వాతి సమ్మేళనంపై చర్చించడం… ముహూర్తం ఖరారు చేయించి అది అయ్యేదాకా ఫాలో చేసుకోవడం.

ఇలా ఇప్పటి వరకు ఈ రెండు జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 60కి పైగా ఆత్మీయ సమ్మేళనాలను సక్సెస్‌ఫుల్‌గా కానిచ్చేశాడు గౌడ్‌ సాబ్‌ తన సారథ్యంలో. అక్కడ ఎమ్మెల్యేలంతా అనుకుంటున్నారట….ఈయనను ఇన్‌చార్జిగా ఇవ్వడమేమో గానీ .. కొన్ని రోజుల తీరిక కూడా ఇవ్వకుండా వెంటపడుతున్నాడేంటిరా నాయనా..? అని. ఇంకో విషయం ఏమిటంటే చాలా చోట్ల మండలానికి ఒకటి, రెండు ఆత్మీయ సమ్మేళనాలు చేస్తూ పోతున్నారు. ఇక్కడ మాత్రం పది గ్రామాలకొక సమ్మేళనాన్ని కూడా చేయించడంతో ఈ సమ్మేళనాల సంఖ్య రాష్ట్రంలోనే మొదటి లిస్టులో చేరుతున్నాయట. అట్లుంటది మరి వీజీ గౌడ్‌తో.

You missed