ఎస్సీ, ఎస్టీలకు జనభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తున్నారు. సరే, మరి బీసీలను విభజించి పీలికలు, చీలికలు చేసి పాలించడం ఇంకెంతకాలమంటూ ప్రశ్నించేందుకు జర్నలిస్టుల వేదిక రెడీ అయ్యింది. సీనియర్‌ జర్నలిస్టు మ్యాడం మధుసూదన్‌ నేతృత్వంలో బీసీల సాధికారత లో జర్నలిస్టుల పాత్ర ఏమిటి..? ఏమి చేయాలనే అంశంపై రేపు బీసీ జర్నలిస్టుల సమ్మేళనం నిర్వహిస్తున్నారు. బీసీ సమాజాన్ని దీనికి ఆహ్వానిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ నుంచి ఈరవత్రి అనిల్‌, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణలు పాల్గొంటున్నారు.

ముఖ్య అతిథిగా ద్రవిడార్‌ కజగం అధ్యక్షుడు, ఎడిటర్‌ ఇన్ చీఫ్‌ వీరమణి, స్పెషల్‌ గెస్ట్‌గా ఫారెన్‌ కరస్పాండెంట్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సౌత్‌ ఏసియా ప్రెసిడెంట్‌ ఎస్‌. వెంకట నారాయణ హాజరవుతున్నారు. రేపు ఉదయం 1౦ గంటలకు ఖైరతాబాద్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగే ఈ సభకు బీసీ జర్నలిస్టులంతా పెద్ద ఎత్తున హాజరై తమ గొంతుక వినిపించాలని, సలహాలు, సూచనలు ఇవ్వాలని సీనియర్‌ జర్నలిస్టు మ్యాడం మధుసూదన్‌ కోరారు. మరిన్ని వివరాలకు 9949774458 నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

You missed