కేసీఆర్‌ వాగ్గాటి మహా రైతులను ఆకట్టుకున్నది. పూర్తిగా హిందీలో సాగిన ఆయన ప్రసంగం వారిని ఆకర్శించింది. ప్రధానంగా రైతు బందు స్కీమ్‌ వారిలో ఎంతో మక్కువను పెంచింది. కేసీఆర్ ప్రసంగానికి, పంచులకు కేరింతలు, చప్పట్లతో తమ ఆమోదాన్ని తెలుపుతూ సభకు కొత్త ఊపునిచ్చారు మరాఠీలు. నాందేడ్‌లో జరిగిన తొలి బీఆరెస్‌ సభ మొత్తానికి సక్సెసయ్యాంది. చేరికలు కొన్నే జరిగినా.. కేసీఆర్‌ తనదైన శైలిలో పూర్తిస్థాయిలో హిందీ ప్రసంగం చేయడంతో ఎక్కువ మందికి అది రీచ్‌ అయ్యింది. నాందేడ్‌ వేదికగా ఆయన చేసిన ప్రసంగంగ దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఆచరణ యోగ్యమా కాదా అనే విషయాలు పక్కన పెడితే తెలంగాణలో సాధ్యమయ్యింది కదా తమ వద్ద ఎందుకు కాదనే ఆలోచనను రేకెత్తించడంలో మాత్రం కేసీఆర్‌ సఫలీకృతుడయ్యాడు.

అమెరికా కంటే భారతదేశం చాల గొప్పదంటూ చేసిన కేసీఆర్‌ ప్రసంగం ఎవరికీ ఎక్కలేదు. కొన్ని మాటలు అతిగా అనిపించాయి. అవి వాళ్లు స్వీకరించలేదు. ఆ మాటలు చెప్పినప్పుడు పెద్దగా సభ నుంచి స్పందన రాలేదు. రైతబంధు స్కీం గురించి చాలా మందికి అవగాహన ఉంది. అది తమకూ కావాలనే డిమాండూ, కోరిక, ఆశ చాలా రోజలుగా తెలంగాణ సరిహద్దు ప్రాంతాల రైతులకు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది కేసీఆర్‌ను అక్కడి ప్రజలు అభిమానిస్తారు. ఆహ్వానిస్తారు. అందుకే ఈ సభ సక్సెసయ్యిందనే చెప్పాలి. వేరేచోట ఇంతటి స్పందన ఉండకపోవచ్చు. అది కేసీఆర్‌కూ తెలుసు. ఎక్కడ ఎలా మాట్లాడాలో .. ఎలాంటి మాటలతో ఆసక్తి రేకెత్తించాలో. పది రోజుల్లోనే మహారాష్ట్రలోని ప్రతీ నియోజకవర్గంలో జీపుజాతా ఉంటుందని కూడా కేసీఆర్‌ ప్రకటించాడు. తెలంగాణ తర్వాత మహరాష్ట్రపైనే కేసీఆర్‌ అత్యధికంగా ఆశలు పెట్టుకున్నట్టు ఈ సభ ద్వారా తేటతెల్లమైంది.

You missed