వాళ్లంతా పొట్ట చేతబట్టుకొని భాగ్యనగరానికి వచ్చినవారు. కడుపు తిప్పల కోసం ఉన్న ఊళ్లో ఉపాధి లేక రాజధాని బాట పట్టిన వాళ్లు. ఇక్కడ కిరాయిలు కట్టలేక, పెద్దగా ఆదాయం లేకపోయినా.. ఇరుకిరుకు కిరాయి ఇళ్లలో కాపురాలు చేస్తూ ఆలుమగలు కంపెనీలలో జీతగాళ్లుగా, రోజువారీ కూలీలుగా చేస్తూ ఖర్చులు పోనూ ఎంతో కొంత వెనుకేసుకుంటూ వస్తున్నారు. అదే వారి ఆదాయం. కరోనా మొదటిసారి దాడి చేసినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో పాటు తెలంగాణ నుంచి వచ్చిన వలస కూలీలు కూడా సొంతూళ్లకు చేరుకున్నారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని.

డబుల్ బెడ్‌ రూంల పై ఆశ పోయింది. కట్టిన చోటే ఇంకా ఇయ్యలేదు. కొత్తవి కట్టే పరిస్థితీ లేదు. అందుకే సర్కార్‌ కూడా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల జోలికి పోవడం లేదు. సొంత జాగా ఉన్నోళ్లకు డు లక్షల ఆర్థిక సాయం చేసే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది చెప్పి కూడా చాలా రోజులే అవుతుంది. కానీ అది ఇంకా అమలులోకి రాలేదు. మొన్న కేసీఆర్‌ పబ్లిక్‌ మీటింగులో త్వరలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నామని ప్రకటించిన తర్వాత ఆశలు చిగురించాయి. సొంతిటి కల నేరవేరబోతుందని కొంచెం నమ్మకం కలిగినట్టుంది. హైదరాబాద్‌లో పనిచేసుకుంటున్న వాళ్లు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు పెట్టేబేడ సదురుకుంటున్నారు.

You missed