#ఆగస్టు వినాయకచవితి_చందా….
స్కూలుకి చందాకి వెళ్లి
సార్ చందా అని అడిగారు
#సార్: నేను ఇవ్వను అన్నాడు
#వచ్చిన_బ్యాచ్: ఎందుకు ఇవ్వరు
#సార్: నేను దేవుని నమ్మను కాబట్టి దేవుళ్ళ కోసం నేను ఇవ్వను
#వ.బ్యా.: ఎందుకు నమ్మరు, సరస్వతిని నమ్మరా మీరు టీచర్ ఎట్ల అయిర్రు,
#సార్: నేను చదువుకొని టీచర్ ఐనా,
#వ.బ్యా.: సరస్వతి దేవి లేకుండా మీకు చదువెట్ల వచ్చింది
#సార్: చదువుకు మీరు చెప్పే సరస్వతి కి ఏంటి సంబందం, సరస్వతి అనే ఆమె ఉందని మీరు ఎట్లా చెప్తుర్రు, ఐనా అమెరికా,ఆస్ట్రేలియా… etc దేశాల్లో సరస్వతి లేదుగా వాళ్ళు సదువుకోలేదా,
అని వచ్చిన వాళ్ళకి science. గురించి వివరించి పంపించారు ఆ టీచర్
కానీ ఇదంతా విన్న బ్యాచ్ కి వాళ్ళ బుర్రలో ఉన్న దానివల్ల ఏమి అర్థంకాలే, అప్పుడు silent గానే వున్నారు.
మొన్న నరేష్ బైరి ఇష్యూ జరగగానే, కాలీగా ఉన్న బ్యాచ్ కి మొన్న చందా అడిగితే ఇవ్వని విషయం గుర్తొచ్చి, ఆ రోజు సమాధానం లేదు, ఈ రోజు సమాధానం అవసరము లేదు కేవలం దౌర్జన్యం చాలు అని, ఛలో ఇప్పుడు వెళ్లి వాడి సంగతి చూద్దాం అని ఇంకో బ్యాచ్ ని ఏస్కొని స్కూల్ ముందుకెళ్ళి, సారి చెప్తావ స్కూల్ మొత్తం ఆగమాగం చేయాలా?
సారి చెప్పకుండా నువ్ ఊరు ఎట్ల దాటుతావ్?
అనే దౌర్జన్యకరమైన విధానాలతో బెదిరించారు,
అప్పటికీ ఆ సార్ వినకపోతే, తోటి ఉపాధ్యాయులు నచ్చజెప్పి ఎందుకు సార్ వాళ్ళతో గొడవ అని ఒప్పించారు.
సారి చెప్పడానికి ఒప్పుకున్నాక స్కూల్లో కాదూ, నువ్ దేవుణ్ణి నమ్మనన్నావ్ కదా, నువ్ వచ్చి గుడిలో సారి చెప్పాలి అని, ఆ టీచర్ ని గుడికి తీసుకెళ్లి, జై శ్రీరామ్ తదితర నినాదాలు ఇప్పించి, బొట్టు పెట్టి క్షమాపణ చెప్పించారు. ఇది వాస్తవంగా జరిగింది.
(..కానీ పేపర్ల మాత్రం స్కూల్లో టీచర్ పిల్లలకి దేవుళ్ళు లేరని పాఠాలు చెబుతున్నారు అని మాత్రమే రాసారు,)
ఐనా గుంపులు గుంపులుగా వెళ్లి ఒక వ్యక్తి చేత క్షమాపణ చెప్పించడం ఒక విజయమా!
మీరు ఒక్కరే వెళ్లి ఆ సార్ తో చర్చ చేసి ఆయన తప్పును ఒప్పుకునేలా చేయొచ్చు కదా!
బెదిరించి భయపెట్టి ఒక మనిషి చేత క్షమాపణ చెప్పించడమే ఎదో ఘనకార్యమా!
అసలు స్కూల్ బోధనా విషయాల్లో జోక్యం చేసుకోడానికి మీరు ఎవరు,
నిజంగా మీకు పిల్లల భవిషత్ మీద అంత ప్రేమ ఉంటే, స్కూల్స్ ప్రారంభం అయ్యి 6నెలలు ఐనా చాలా స్కూల్స్ లో నేటికీ విద్యార్తులకి యూనిఫామ్స్ రాలేదు, కొట్లాడకుండా ఎక్కడున్నారు మీరు?
స్కూల్లో పిల్లలకి మధ్యాహ్న భోజనం సరిగా పెట్టకపోతే వెళ్లి సంబంధిత అధికారులను నిలదీయండి ఎందుకు పెట్టట్లే అనీ,
స్కూల్లో వాటర్ సౌకర్యం లేకుంటే ప్రభుత్వానికి, ఆ అధికారులకు చెప్పి నీటి సౌకర్యం కల్పించండి,
అమ్మాయిలకు టాయిలెట్స్ లేక రోజంతా ఇబ్బంది పడుతున్న స్కూల్స్ ఉన్నాయి, వాటి గురించి కొట్లాడండి,
స్కూల్లో ప్రతి సబ్జెక్ట్ కి క్వాలిఫైడ్ టీచర్ ఉన్నాడా లేడా అని తెలుసుకొని , లేకుంటే జిల్లా విద్యాధికారికి చెప్పి సరైన ఉపద్యాయుల్ని ఆ స్కూల్ కి రప్పించండి.
ప్రభుత్వం నుండి స్పందన ఆలస్యమైతే మీ ఊరు మీ పిల్లల కోసం వాళ్ళ భవిషత్ కోసం మీరే చందాలు వేస్కోని మీతో వీలైనన్ని సౌకర్యాలు కల్పించండి. ఇవన్నీ వదిలేసి స్కూల్లో ఎవరు ఏ పాఠం చెప్పాలి అని చెప్పడానికి మీరు ఎవరు ?
డీఎస్సి, టెట్ లు చదివి వచ్చిన ఉపాధ్యాయులతో ఇలా భయపెట్టి science. కి వ్యతిరేకంగా గుళ్లలోకి తీసుకెళ్లి మొక్కించడాలు , బొట్లు పెట్టడాలు దుర్మార్గమైన చర్య, ఇలాంటి సంఘటనలపై ఉపాద్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామిక వాదులు,మేధావులు స్పందించాల్సిన అవసరం ఎంతో ఉంది. పైగా ఇదంతా MEO ముందే జరగడం మండల విద్యాధికారి దీన్ని ఆపకుండా చూస్తూ ఉండడం రేపటి ఉపాద్యాయుల బోధనా తీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది, ఇక ఏ ఉపాద్యాయుడు పిల్లలకి నిజాలు చెప్పడానికి ధైర్యం చేయడు. ఇలాంటి సంఘటన మరో ఉపాధ్యాయునికి మరో స్కూల్ కి ఎదురుకాకుండా ఉపాద్యాయ సంఘాలు ఐక్యంగా పోరాడాలి. ఈ రోజు జరిగింది మనకు కాదు కదా అని ఊరుకుంటే మన వరకు వచ్చేసరికి మాట్లాడడానికి ఎవరూ ఉండరు.

 

ఇ. రఘునందన్ టిపిటిఎఫ్ రాష్ట్ర నాయకులు

You missed