జర్నలిస్ట్.. అంటే నిజాయితీగా పక్ష పాతం లేకుండా వార్త కథనాలు ఇచ్చే కలం వీరుడు.
ప్రాణపాయం ఉందని తెలిసినా వార్త కథనం కోసం ప్రజల వైపు నిలిసే నిఖార్సయిన జర్నలిస్ట్..
కానీ.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వేన్షన్ లో ఆదివారం ప్రారంభమైన టీయుడబ్లుజె అండ్ ఐజెయు మహాసభల పేరిట జరిగిన.. జరుగుతున్న సభలను చూస్తే నా మీద నాకే విరక్తి పుట్టింది.

ఛీ… ఛీ.. ఇదేనా జర్నలిజం అనిపించింది.

జర్నలిస్ట్ గా బతికే బదులు ఆత్మహత్య చేసుకోవడం బెటర్ అనిపించింది. జర్నలిజం పేరుతో తెలంగాణ స్టేట్ లో జరుగుతున్న ‘‘పొలిటికల్ జర్నలిజం’’లో అన్నీ నాకు తెలుసు అనే ఫీలింగ్ తో ఉండే నిజాయితీ జర్నలిస్ట్ లు ఆ వాతవరణంలో ఎలా ఉంటున్నారో అర్థం కాలేదు.

ఇంతకు టీయుడబ్లుజె అండ్ ఐజెయు మహాసభలలో ఏమి జరిగిందో మీకు చెప్పడం నా బాధ్యత.

అవి టీయుడబ్లుజె అండ్ ఐజెయు మహాసభలు కావు.. కానే కావు. టీఆర్ఎస్.. సారీ.. సారీ.. పేరు మార్చుకున్నారు గదా.. అదే బీఆర్ఎస్ సభ. గులాబీ రంగులో మునిగి తేలిన జర్నలిస్ట్ పెద్దలు కేసీఆర్ మెప్పు కోసం ఆ సభ నిర్వహించారనిపించింది.

నిజానికి కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడగానే ఇప్పటి నుంచి టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదు.. ఇది రాజకీయ పార్టీ అన్నారు. మరీ..

అల్లం నారాయణ నాయకత్వంలో ఏర్పడిన టీయుడబ్లుజె కు తెలంగాణ సెంటిమెంట్ తో చాలా మంది నాలా జర్నలిస్ట్ లు మద్దతు ఇచ్చారు. ఇప్పుడేమో.. అదే సెంటిమెంట్ ను ఉపయోగించుకుని వ్యక్తిగతంగా లాభ పడాలని చూస్తున్న కొందరు జర్నలిస్ట్ పెద్దల స్వలాభం కోసం టీయుడబ్లుజె అండ్ ఐజెయు మహాసభల పేరిట గ్రామీణ ప్రాంత విలేకరులను సమీకరించారనిపించింది.

రాబోయే ఎన్నికల కోసం కొందరి స్వార్థం కోసం టీయుడబ్లుజె అండ్ ఐజెయు మహాసభలు నిర్వహిస్తుంటే నిఖార్సయిన జర్నలిస్ట్ లు ‘వాస్తవం’ ఆలోచించక పోవడం బాధగా ఉంది.

జర్నలిస్ట్.. అంటే నీతిగా.. నిజాయితీగా.. నిస్వార్థంగా ఉండాలి. అప్పుడే అతనిపై అందరికి గౌరవం ఉంటుంది. కానీ.. కేసీఆర్ టీఆర్ ఎస్ ను బీఆర్ ఎస్ గా మారిస్తే.. అల్లం నారాయణ బృందం టీయుడబ్లుజె ను ఐజెయు పేరుతో దేశ వ్యాప్తంగా తాము జర్నలిస్ట్ లం కేసీఆర్ కు మద్దతు ఇస్తామని చెప్పడానికి ఈ మహాసభల తంతు అనే విషయం నాతోటి జర్నలిస్టులకు అర్థమైనా.. బహిరంగంగా నిలదీయలేక పోవడానికి కారణాలు ఏమై ఉంటాయి…?

టీయుడబ్లుజె అండ్ ఐజెయు మహాసభల వేదిక వద్దకు వెళ్లుతున్నప్పుడు కనిపించిన ఫ్లెక్సీలు చూస్తే.. ఇది ఫ్యూర్ కేసీఆర్ గులాబీ మీటింగ్ అనిపించింది. ఆ మహాసభకు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథి.

ఒక జర్నలిస్ట్ గా టీయుడబ్లుజె అండ్ ఐజెయు మహాసభలకు వెళ్లినందున కళ్ల ముందు కనిపించిన స్వీయ అనుభవానికి అక్షర రూపం ఇదీ.
ఈ నా స్వీయ అనుభవాన్ని నిజాయితీగా బతికే జర్నలిస్ట్ లు సమర్థిస్తుండవచ్చు.. లేదంటే.. రాబోయే ఎన్నికలలోనో.. ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ సార్ తో ఇంకేదో లాభ పడలానుకునేటోడు నన్ను విమర్శిస్తాడొచ్చు..

ఐ డోంట్ కేర్.. నేను నిఖార్సయిన జర్నలిస్ట్ ను.. ఇలాగా రాస్తాను.

ఈ మీటింగుకు కవిత వచ్చి మాట్లాడారు. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత లేదన్నారు. అవును అది నమస్తే తెలంగాణలో కూడా నిరూపతమైంది. ఎంతో మంది జర్నలిస్టులను రోడ్డున పడేసినా ఎవ్వరూ కుక్కురుమనలేదు. అల్లం నారాయణ బృందంతో పాటు అధికార పార్టీ నేతల వరకు. ఇది ఒకసారి గుర్తు చేయాలనిపించింది అంతే.

– ఎం. ప్రభాకర్, జర్నలిస్ట్
హైదరాబాద్

You missed