ప‌ట్ట‌ణాల్లో నాగ‌రిక‌త రోడ్లై.. వీథిలో లైట్లై.. వాడ‌ల్లో లే అవుట్లై… అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజై.. కూడ‌ళ్ల‌లో పార్కులై.. కుళాయిలై.. బ‌డులు, కాలేజీలు.. కాల‌క్షేపానికి థియేట‌ర్లు.. షాపింగ్ మాల్సై క‌న‌బ‌డుతుంది.
వాన‌లు, వంక‌లు వచ్చిన‌ప్పుడు వ‌ర‌ద‌లై ఉప్పొంగుతుంది కూడా..
కానీ ఈ ప‌ల్లెలో నాగ‌రిక‌త‌.. ఇళ్ల‌లో ఇంకుడుగుంత‌లై.. కూడ‌ళ్ల‌లో ప‌రిశుభ్ర‌తై.. ఆలోచ‌న‌ల్లో విజ్ఞ‌త‌, విచ‌క్ష‌ణై… న‌డ‌క‌, న‌డ‌త‌ల్లో సంస్కార‌మై.. కొలువులు, కొట్లాట‌ల‌కు నిర్వాసితై.. స్త్రీ, పురుష స‌మాన‌త్వమై వెల్లివిరుస్తోంది.!!

అదెక్క‌డో అభివృద్డి ఆకాశాన్నంటిన‌… హ్యాపీ ఇండెక్స్‌లో పైనున్న దేశాల్లో లేదు..
తెలంగాణ‌లో… రాష్ట్ర రాజ‌ధానికి హైద‌రాబాద్‌కు నూరు కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.
పేరు వెంకంప‌ల్లి… నాగిరెడ్డిపేట మండంలం, కామారెడ్డి జిల్లా..

సాక్షి సండే స్పెష‌ల్‌లో క‌వ‌ర్ స్టోరీ….
రాసింది…

సాక్షి కామారెడ్డి స్టాఫ్ రిపోర్ట‌ర్
సేపూరి వేణుగోపాల చారి

ఓ లుక్కేయండి.. బాగుంది. అభినంద‌న‌లు … వేణుగోపాల చారికి, సాక్షికి …స‌ర‌స్వ‌తీ ర‌మ‌ కు…

You missed