పార్టీకొక పేపర్… ఛానల్ వెనుక ఒక పార్టీ. ఇప్పుడంతా అదే ట్రెండ్. మీడియా అంటేనే అంత. ఏదో ఒక పార్టీ సపోర్టు లేకుండా పనిచేయవు. కొన్ని తెలయకుండా జాగ్రత్త పడుతూ ఏదో తంటాలు పడతాయి. కొన్ని బొక్కలు మెడలేసుకుంటాయి. అధికార పార్టీ పత్రిక నమస్తే తెలంగాణ. కాంగ్రెస్‌కు మీడియాలేదు. బీజేపీకి మాత్రం వెలుగు ఉంది. తాజాగా ఈ లిస్టులో దిశ డిజిటల్ పేపర్ చేరింది. మునుగోడు ఉప ఎన్నిక నుంచి మొత్తం దిశ కాషాయమయమైంది. న్యూట్రల్ ఉంటాం. ఉన్నదున్నట్టు చెబుతాం అని అందరూ చెబుతారు.
దిశ కూడా అదే పాటకుందుకుని వచ్చింది. కానీ మునుగోడు ప్యాకేజీ విషయంలో బీజేపీ వైపే మొగ్గు చూపినట్టుంది. అందుకే ఆ పేపర్ కాషాయరంగు పులుముకుంది. టీఆరెస్ అంటే పడదు. కేసీఆర్ అంటే గిట్టదు. మరి బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ను ఎంచుకోవచ్చు కదా. అది డబ్బులిచ్చేలా లేదు. లేచేలా లేదు. ఆ జాకీలు పెట్టడమేదో బీజేపీకి పెడితే.. అదే లేస్తుంది కదా.. అనుకున్నారేమో. అందుకే బీజేపీకి జాకీలు పెడుతున్నారు. కాంగ్రెస్ వార్తలకు ఇందులో అవకాశం ఉండదు. ప్రాధన్యతా ఉండదు. బీజేపీ పువ్వు వార్తలు బ్యానర్లుగా వస్తాయి. లేదా కాంగ్రెస్ యాంటీ వార్తలు. అయినా మన అమాయకత్వం గానీ… వాళ్ల పత్రిక వాళ్లిష్టం. ఎవరు ప్యాకేజీలిస్తే, ఎవరు సపోర్టుగా ఉంటే.. ఎవరి వాళ్ల లాభం ఉంటే వారితో జత కడతారు. వారి వార్తలే రాస్తారు. అన్ని పత్రికలూ చేసేది అదే కదా. మరి దిశ నెందుకు నిందించడం..? దాన్నెందుకు ఆడిపోసుకోవడం..? ఆ పేపర్నెందుకు బద్నాం చేయడం అంటారా..? సరే, ఒకే అలాగే కానీ…..