VRA లు చేస్తున్న సమ్మె పై తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జరిపిన చర్చలు సఫలీకృత‌మ‌య్యాయి.

VRA ల 80 రోజులగా నిర్వహిస్తున్నటువంటి నిరవధిక సమ్మె నేటితో ముగిసింది, వారి డిమాండ్లపై తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం నిర్వహించిన చర్చలు సఫలీకృతమయ్యాయి.

వీఆర్ఏ ల యొక్క డిమాండ్లు పే స్కేల్, ప్రమోషన్స్, వయస్సు పైబడిన వారి యొక్క వారసత్వపు హక్కు, సమ్మె కాలాన్ని రెగ్యులరైజ్ చేయడం వంటి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సానుకూలమైన హామీని ఇచ్చారు.

ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున వచ్చేనెల 7 తారీకు తర్వాత తిరిగి సమావేశమై వీఆర్ఏల యొక్క ప్రతి డిమాండ్ పైన ఒక స్పష్టమైన కార్యచరణ వస్తుందని.. దాని పై చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఆయ‌న హామీ ఇచ్చారు.

వీఆర్ఏల కష్టాన్ని, వారి పరిస్థితిని, వారి ఇబ్బందులను, ఆవేదనలను గుర్తించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకు, స‌మ‌స్య‌ పరిష్కారం కోసం చొరచూపినటువంటి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి కి.. రాష్ట్ర రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ తరపున, వీఆర్ఏ జేఏసీ తరఫున ఈ సంద‌ర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ చర్చలలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ వంగ రవీందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్గా, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి, రాష్ట్ర జేఏసీ నాయకులు పాల్గొన్నారు

You missed