సిద్దాంతాలంటూ దాని మీదే న‌డిచే పార్టీ ఏదైనా ఉందా..?

మేనిఫెస్టోలో చెప్పిన హామీల‌న్నీ నెర‌వేర్చిన నాయ‌కుడెవ‌డైనా ఉన్నాడా..?

అధికారానికి బానిస‌కాని నేతెవ‌డైనా ఉన్నాడా…?

నో.. నో.. నో….

అన్నింటికీ ఇదే ఆన్స‌ర్.

కొన్ని చెప్పుకోవ‌డానికి, విన‌డానికే బాగుంటాయి. అమ‌లులో అవి సాధ్యం కాదు. అది అంద‌రికీ తెలుసు. ప్ర‌జ‌ల‌కూ తెలుసు. కానీ చెప్పిన దాంట్లో కొన్నైనా చేయ‌క‌పోతాడా..? వాడ్ని మార్చి వీడికేద్దాం అనే మార్పు కోసమే త‌ప్ప‌.. అంతా ఒక్క‌తాను ముక్క‌లే క‌దా.. కాదా..?

ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే డ‌బ్బు కావాలి. లిక్క‌ర్ పంచాలి. ఓటుకింత అని ఇయ్యాలి. ఇది చెయ్య‌కుండా గెలిచిన నాయ‌కులెంత మంది…? మ‌రి అన్నీ తెలిసి ఇంకా సిద్దాంతాలు, రాద్దాంతాలు అవ‌స‌ర‌మా.. ? హ‌జారే..!

లిక్కర్ పాల‌సీ…. ఇది లేకుండా ప్ర‌భుత్వాలున్నాయా..? మ‌ద్యపాన నిషేధం అమ‌లు చేసి బ‌తికి బ‌ట్ట‌క‌ట్టే ప్ర‌భుత్వాలెన్ని..?

కొంచెం ప్రాక్టిక‌ల్‌గా ఆలోచించు హ‌జారే.! అంద‌రూ ఒక్క‌తాను ముక్క‌లే. మ‌రి మీ మోదీ ఏం త‌క్కువ తిన్నాడా..?

ఆయ‌న చేసిన వ్య‌వ‌హారాలు, న‌ష్టాల గురించి, ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు మ‌రింత దిగ‌జారి పాతాళానికి పోయిన వైనం గురించీ కాస్త మాట్లాడితే బాగుండేది..?

అయినా నువ్వో ఔట్ డేటెడ్‌. నీ మాట‌లు వినేందుకు విన‌సొంపే. కానీ ఆచ‌ర‌ణ‌లో మ‌న నేత‌ల‌కు అది ప‌ర‌మ‌కంపు…అందుకే నువ్వు అట్ల‌నే ఉండు.. చూస్త‌నే ఉండు.. వీళ్లు చేసే ప‌ని చేసుకుంటూ పోత‌రు….

You missed