బలుపు మాటలు.. కండోమ్ లు అవసరమున్నోడు కొనుక్కుంటడు.. కానీ శానిటరీ నాప్కిన్స్ ప్రతి అమ్మాయికి అవసరం.. నెల కాంగనే పాత బట్టలు వాడలేక, నాప్కిన్స్ కొనలేక ఆ నాలుగైదు రోజులు బడి బందు పెట్టే పిల్లలు లక్షల్లో ఉన్నరు.. పాత బట్టలు వాడి ఇన్ఫెక్షన్ కు గురయ్యే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు..

శానిటరీ నాప్కిన్స్ కావాలని నోరు తెరిచి అడిగే పరిస్థితి తీసుకురావడమే దరిద్రం.. అలాంటిది ఆ అమ్మాయికి భరోసా ఇయ్యకుండా వెటకారంగా మాట్లాడడం, చదువుకున్న మూర్ఖురాలు అవడం, అందులోనూ ఈ బాధ తెలిసిన మహిళ ఇట్లా మాట్లాడడం బాధాకరం..

ఒక అమ్మాయి కోసం నెలకు కనీసం 30 రూపాయలు కూడా ఖర్చు చేయలేని ప్రభుత్వం, ఇంకా భేటీ బచావో, భేటీ పడావో లాంటి కార్యక్రమాలు చేయడం ఎందుకు?? అది వారి హక్కు.. ప్రతీ అమ్మాయికి ప్రభుత్వమే అందించాలి.. చూడడానికి ఇది చిన్న ఇష్యులా కనిపించొచ్చు.. కానీ ఈ సమస్య వల్ల డ్రాపవుట్స్ అవుతున్న విద్యార్థులు ఎందరో ఉన్నరు..

ఈ సమస్య మీద అవగాహన కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు నాణ్యమైన నాప్కిన్స్ అందిస్తున్న #PURE లాంటి సంస్థకు ధన్యవాదాలు..

Akhilesh Kasani

You missed