గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో ఓ వార్త బాగా చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌ళ్లీప‌రు తీన్మార్ మ‌ల్ల‌న్న వార్త‌ల్లో వ్య‌క్త‌య్యాడు. ఆ వార్తేంటంటే…మ‌ల్ల‌న్న కోటిన్న‌ర విలువ జేసే వోల్వో ఎక్స్‌సీ 90 కారును కొనుగోలు చేశాడ‌ని. ఆఫ్ట్రాల్ ఓ యూట్యూబ్ ఛానెల్ న‌డుపుకునే మ‌ల్ల‌న్న ఇంత డ‌బ్బెక్క‌డిదీ… ? అనేదే ఇప్పుడు చ‌ర్చ‌. ర‌చ్చ‌. ఇలా మ‌ల్ల‌న్న‌లా ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని అంద‌రినీ బెదిరించుకుంటూ బ‌తికితే పోలా..? ఎంచ‌క్కా కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తొచ్చు అనే కామెంట్ల‌ను గుప్పిస్తూ టీఆరెస్ శ్రేణులు సోష‌ల్ మీడియాలో త‌మ క‌చ్చ తీర్చుకుంటున్నారు. వీడో బ్లాక్‌మెయిల‌ర్‌… అందుకే అలా అడ్డంగా సంపాదించాడు… అంటూ కామెంట్ల‌తో క‌సి తీర్చుకుంటున్నారు. పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానెళ్ల తో జ‌ర్న‌లిజం అనేది పూర్తిగా భ్రష్టు ప‌ట్టిపోయింది. వ్యూయ‌ర్‌షిప్ కోసమో.. యాడ్స్ కోసమో ఆస‌క్తిక‌ర వార్త‌ల‌నే పేరుతో ఇష్ట‌మొచ్చిన హెడ్డింగులు పెడుతూ.. ప‌రువును బ‌జార్ల‌పెట్టి బ‌తికే ప‌రిస్థితి ఏర్ప‌డింది. తీన్మార్ మ‌ల్ల‌న్న వార్త‌లు దీనికి ప‌రాకాష్ట‌.

You missed