నేటి నుంచి బ‌డులు తెరుచుకుంటున్నాయి. స‌ర్కారు బ‌డుల ప‌రిస్థితి ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉంది. గ‌తంలో క‌న్నా మ‌రీ దారుణంగా ప‌రిస్ఙ‌తులు త‌యార‌య్యాయ‌ని పేరు తెలియ‌ని ఓ ఉపాధ్యాయుడు రాసిన పోస్టు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
…………………………………………………………………………..
కోరి…..కొట్లాడి తెచ్చుకున్న….బంగారు తెలంగాణ లో
😭🔔🔔🔔🔔🔔🔔😭

జూన్ 13 నాడు

* పుస్తకాలు అందుబాటులోకి రావు.

* యూనిఫాంలు రావు.

* పారిశుద్ధ్య కార్మికులు స్కావెంజర్ లు లేరు.

* హైస్కూల్ లలో అటెండర్/ జూ. అసిస్టెంట్ లు లేరు.

* వంట చేసే వారు రారు.

* మన ఊరు మన బడితో పాఠశాలల మరమ్మత్తులు గానీ,‌ నవీకరణ గానీ మొదలు పెట్టింది లేదు

* పాఠశాల లకు ఒక్క రూ. ఖర్చు చేసింది లేదు. 👆

* పాఠశాలలలో మౌలిక సదుపాయాల కల్పన లేదు

👉👉ప్రమోషన్స్ లేవు

👉👉సాధారణ బదిలీలు లేవు

* ఉన్నత పాఠశాల లలో సబ్జెక్టు నిపుణుల కొరత

👉 రాష్ట్రంలో 90% జిల్లాలకు జిల్లా విద్యా శాఖ అధికారులు DEO లేరు.

* 95% మండలాల్లో MEO లు లేరు.

👉 హైస్కూల్ ల లో 40% ప్రధానోపాధ్యాయులు లేరు.

* 317 జీవో బాధితులను పట్టించుకున్నది లేదు .

* 13 జిల్లాలో స్పౌజ్ ఊసే లేదు

* 402 జీవోను కాపాడే ఆలోచన లేదు

* 21 జీవో ప్రకారంమైనా మూచువల్ బదిలీలు జరుపతారో లేదో తెలియదు.

* జీతాలు సమయానికి వస్తాయో రావో తెలవదు.

* 8సం.లు గా ఇన్ చార్జీలతో ఉద్యోగులకు ప్రశాంతత లేదు.

* ఖాళీలను నింపకుండా వెట్టి చాకిరి తో ఉద్యోగులు సతమతం

* 8సం.లుగా విద్యా వ్యవస్థను పట్టించుకున్న పాపాన పోలేదు.

వీటన్నింటినీ ‌మరచిపోయి రేపు ప్రభుత్వం గొప్పగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిందని పొగుడుతూ బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని

ప్రభుత్వం రూ. ఖర్చు లేకుండా పాలాభిషేకాలు చేయించుకునే గొప్ప ప్రణాళిక.

ఉపాధ్యాయుల జీవితంలో ఎన్నడూ ఇంత మానసిక క్షోభ అనుభవించిన దాఖలాలు గతంలో లేవు.😢😢