ఆస‌రా పింఛ‌న్లు ప్ర‌తీనెలా అందడం లేదు. ఒక నెల పింఛ‌న్ ఆగిపోతుంది. మ‌రో నెల‌కు అది వ‌స్తుంది. అది రావాల‌న్నా ఒక నెల ప‌డుతుంది. అంటే రెండు నెలల పింఛ‌న్లు ఆపి మ‌రీ ప్ర‌భుత్వం ఇస్తుంది. బ‌డ్జెట్ లేదు. ప్ర‌తీ నెలా ఇంతే. మున్సిపాలిటీ ఏరియాల్లో ఖాతాల్లో వేస్తున్నారు. ఎప్పుడు సెల్‌కు మెసేజ్ వ‌స్తుందా పింఛ‌న్ ది అని ఎదురుచూసే ప‌రిస్థితి ఏర్ప‌డింది. మున్సిపాలిటీ ఏరియా మిన‌హా మిగితా అన్ని చోట్లా పోస్టు ఆఫీసుల‌లో ఇస్తున్నారు. స్వ‌యంగా వెళ్లితే గానీ పింఛ‌న్ అంద‌దు.

ఇగో ఇలా ఒకేసారి వ‌చ్చి ప‌డిగాపులు కాస్తారు. కొత్త పింఛ‌న్ల ఊసే లేదు. రెండు ఏండ్లు గ‌డిచినా కొత్త వాటికి మోక్షం లేదు. గ్రామ స్థాయిలో వింత‌తుల పింఛ‌న్లు నెల‌కు ప‌దుల సంఖ్య‌లో వ‌స్తున్నాయి. వీటిని ఎంక్వైరీ చేసి అర్హులుగా గుర్తించి ప్ర‌భుత్వానికి పంపుతున్నారు. ఇలాంటి కొత్త పింఛ‌న్లు ఇప్పుడు ల‌క్ష‌ల్లో ప్ర‌భుత్వం వ‌ద్ద పెండింగ్‌లో ఉన్నాయి. కానీ ప్ర‌భుత్వం వాటిని ప‌ట్టించుకోవం లేదు. పైగా హుజురాబాద్ ఎన్నిక‌ల వేళ వృద్దుల పింఛ‌న్‌కు అర్హ‌త వ‌య‌స్సును 57కు కుదిస్తూ కొత్త అప్లికేష‌న్లు తీసుకున్నారు. ఇవి ల‌క్ష‌ల్లో వ‌చ్చాయి. ఇప్పుడు ఇవి కూడా జ‌మ అయి కూర్చున్నాయి. ఆస‌రా పింఛ‌న్లే మాకు శ్రీ‌రామ ర‌క్ష అని చెప్పుకునే ప్ర‌భుత్వం వీటిని భ‌రించ‌లేక‌పోతున్న‌ది. ఈ భారం మోయ‌లేక‌పోతున్న‌ది.

You missed