కరోనా వైరస్ కరస్పాండెంట్ దంపతులను కాటేసింది. కోవిడ్ కారణంగా స్కూల్స్ మూతపడటంతో విద్యార్థుల నుంచి రావలసిన ఫీజులు ఆగిపోయాయి. అధిక వడ్డీలకు అప్పులు చేశాడు. అప్పులు సకాలంలో చెల్లించ లేకపోయాడు. రుణం ఇచ్చిన వారి నుంచి తిట్లు అవమానాలు ఎదుర్కొన్నాడు.. అప్పు తీర్చే అవకాశం కూడా లేదనుకుని స్కూల్లో జెండా వందనం ముగించుకుని కారులో బయలుదేరారు. తండ్రికి వేరే ఊరికి వెళ్లి వస్తానని చెప్పి కారు నడుపుకుంటూ నే సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఫీజులు రాలేక అప్పులు తీర్చలేక పోయానని తన చావుకు అప్పు ఇచ్చిన సుమన్, సునీల్ కుమార్ లు బాధ్యులని సెల్ఫీ వీడియో తీసిన అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆత్మకూరు మండలం కరివేన దగ్గర అపస్మారక స్థితిలో ఉన్న వీరిని ఆస్పత్రికి చేర్చగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన కోవెలకుంట్ల పట్టణంలోని లైఫ్ ఎనర్జీ స్కూల్ కరస్పాండెంట్ సుబ్రహ్మణ్యం అతని భార్య రోహిణి ఇద్దరు కూడా ఆత్మహత్యకు పాల్పడటంతో కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. కరోణా కారణంగా.. ప్రైవేటు స్కూలు కావచ్చు ప్రైవేటు టీచర్లు కావచ్చు ఇంతగా నరకయాతన అనుభవిస్తున్నారు దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు…

Amarnath Vasireddy

You missed