ఈ రోజుల్లో మగపిల్లలకి హత్యలు చేయడానికేమీ భయం లేదు, చంపి జైలుకెళ్దాం అని రెడీ అయ్యే చేస్తున్నారు.. !
“””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””
మగపిల్లల్ని అచ్చోసిన ఆంబోతుల్లా రోడ్లపై వదిలేస్తున్నారు. ప్రభుత్వాలకుకేమో..
చలాన్లు వేయడం, ఫైన్లు కట్టించుకోవడం తప్ప.. సమాజంలోని యువత విచక్షణతో మసలుకొనేలా స్కూళ్లలో, ప్రసార మాధ్యమాల ద్వారా మంచి కార్యక్రమాలు నిర్వహించే ఇంట్రెస్ట్, ఓపిక లేదు.
ఇంట్లోనేమోపిల్లలతో మంచి చెడ్డలు చెప్పడానికి నాన్నకి తీరుబడి ఉండదు. అమ్మ కేమో సీరియళ్ల పిచ్చి.
అదే కూలికెళ్లే తల్లిదండ్రులైతే బతుకుపోరాటంతోనే సరిపోతుంది. కొడుకులేకదా.. ఎక్కడ తిరిగినా ఫర్వాలేదు, ఎవరూ రేప్ చేయరు కదా అనుకుని, ఏమాత్రం అజమాయిషీ చేయరు.
అందుకే రోడ్లపక్కన ఏ షాపు చూసినా, ఏ సందు గొందు చూసినా ఫోనుల్లో తలదూర్చో, ఏవో పనీ పాటాలేని సొల్లు చెప్పుకుంటూనో, అడపిల్లల్ని ఎగాదిగా చూడ్డానికో..ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా మగపిల్లలు..వీళ్ళకి ఇల్లూ, అమ్మానాన్నా లేరా అనిపిస్తుంది అంత లేట్ నైట్స్ కూడా అబ్బాయిలు రోడ్లపై బండ్లేసుకుని చక్కర్లు కొడుతూ ఉంటే.
అదే ఆడపిల్లలైతే?
కాలు బైట పెట్టనివ్వరు. ఆరు దాటితే ఇల్లు దాటడానికి వీల్లేదు. వంద పర్మిషన్లు.. ఇలా మనమ్ మగపిల్లలని నైతికత అవసరం లేని వాళ్లుగా, ఇల్లూ బాధ్యతా పట్టని జులాయిల్లా వదిలేయబట్టే.. ఆడపిల్లలకు రక్షణ లేదు.
మీరు సరిగా పెంచని మగపిల్లలే, మీరు పిరికిగా పెంచుతున్న ఆడపిల్లల పాలిట క్రిమినల్స్ గా
రేపిస్టులుగా తయారౌతున్నారు. Mind it.
ఈ పాపం చేవలేని చట్టాలది.
మగపుట్టుక పుట్టడమే పెద్ద అచీవ్మెంట్ అన్నట్టు ఫీలై, మగపిల్లలకి బుద్ధి, జ్ఞానం సంస్కారం నేర్పని పేరెంట్స్ ది. మార్కులు ర్యాంకులు తప్ప, నైతికత ఏమాత్రం పుస్తకాలద్వారా, పాఠాల ద్వారా నేర్పని మన లోపభూయిష్ట విద్యావిధానాలది.
(Aruna Gogulamanda)
