టిక్‌టాడ్‌వొడు తెచ్చిన మ‌రో కొత్త యాప్ జ‌నాల‌ను వెర్రెత్తిస్తుంది. టిక్‌టాక్‌తో ఆడ‌మ‌గ తేడా లేకుండా అంద‌రినీ పిచ్చివారిని చేసినా చైనావొడు మ‌రో సోష‌ల్ వైర‌ల్ వైర‌స్‌ను వ‌దిలాడు. వాంబో అనే పేరుతో వ‌చ్చిన ఈ కొత్త యాప్ నెటిజ‌న్ల‌ను వెర్రెత్తిస్తుంది. ఒక పాట‌కు త‌మకు న‌చ్చిన ఇద్ద‌రిని ఎంచుకొని వారి త‌ల‌ లాడిస్తున్న‌ట్లు, పాడుతున్న‌ట్లు పాట‌కు త‌గ్గ‌ట్టు హావ‌భావాల‌తో ఎంజాయ్ చేస్తున్న‌ట్లు చిన్న వీడియోను ఈ యాప్ ద్వారా విడుద‌ల చేస్తున్నారు.

ఊపున్న పాట‌లు, మాస్ మ‌సాలా పాట‌లు, ఐటం సాంగుల‌ను తీసుకొని రాజ‌కీయంగా త‌మ శ‌త్రువుల‌నుకున్న వారికి వీటిని అపాదించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక్క‌డే హ‌ద్ద‌లు మ‌రిచారు. ప్ర‌ధాని మోదీ మొద‌లుకొని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల దాకా ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. ఆఖ‌రికి మ‌హిళ మంత్రుల‌ను, కేంద్ర మ‌హిళ మంత్రుల‌ను, ప్ర‌ముఖ మ‌హిళ నాయ‌కురాల్ల‌ను ఈ వాంబో యాప్‌లో బ‌లి చేస్తున్నారు. ఆ వీడియోలు చేసి వైర‌ల్‌గా మార్చి పైసాచికానందం పొందుతున్నారు.  సోష‌ల్ మీడియాలో అడ్డుకునే వారు లేక‌పోవ‌డంతో, నియంత్ర‌ణ క‌రువ‌వ్వ‌డంతో ఎవ‌రికి తొంచింది వారు పెట్టేస్తున్నారు. మున్ముందు ఈ యాప్ మ‌రిన్నీ ఘోర‌, వికృత, భ‌యంక‌ర‌, క్షుద్ర రాజ‌కీయ క్రీడ‌ల‌కు వేదిక కానుంది. రోజుకోటి పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ యాప్‌లు పిచ్చోడి చేతిలో రాయిలా మారాయి.

You missed