జ‌ర్న‌లిస్టుల‌ను ప‌ట్టించుకునే దిక్కులేదు. బానిస బ‌తుకుల క‌న్నా అధ్వానం. జీతాలుండ‌వు. లైన్ అకౌంట్లు రావు. వెట్టిచాకిరి త‌ప్ప‌దు. కానీ జ‌ర్న‌లిస్ట్ ఆ వృత్తి మాత్రం వ‌ద‌ల‌డు. ఫాల్స్ ప్రెస్టీజ్‌లో ప‌డికొట్టుకుపోతూ ఉంటాడు. త‌న‌పై ఆధార‌ప‌డ్డ కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తాడు. ఆఖ‌రికి ఈ జ‌ర్న‌లిస్ట్ జీవితం విషాదాంతం అవుతుంది. ఇవ‌న్నీ ఏ లీడ‌రూ ప‌ట్టించుకోడు. ఈ మేనేజ్‌మెంట్ ద‌య‌చూప‌దు. క‌రోనా వ‌స్తే కాపాడే దిక్కులేదు. ఇక చ‌స్తే అటువైపు చూసిన నాథుడు లేడు. ఇప్పుడు బ‌తికున్న‌వాళ్ల‌తో మాత్రం మ‌ళ్లీ బానిస ప‌ని చేయించుకుంటున్నారు. చాలా మందిని పీకేసీ రోడ్డుపాలు చేసిన అడిగే దిక్కులేదు. ఇప్ప‌డు ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారింది. వందైతే వంద అడుక్కునే ప‌రిస్థితికి కంట్రిబ్యూట‌ర్ వ‌చ్చాడు.

ఎవ‌రూ ప‌ట్టించుకోకున్నా ఈ సంగారెడ్డి డీఈవో మాత్రం బాగా అర్ధం చేసుకున్నాడు. ఓ వైపు ప్రైవేట్ పాఠ‌శాల‌లు ఫీజుల పేరుతో పీల్చి పిప్పి చేస్తున్న ఈ స‌మ‌యంలో జ‌ర్న‌లిస్టుల‌కు ఉచితంగా విద్య‌నందించాల‌ని స‌ర్క్యూల‌ర్ జారీ చేశాడు. గ‌తంలో నిజామాబాద్ డీఈవోగా ప‌ని చేస్తున్న స‌మ‌యంలో కూడా జ‌ర్న‌లిస్టుల పిల్ల‌ల‌కు యాభై శాతం ఫీజులు తీసుకోవాల‌ని స‌ర్క్యూల‌ర్ జారీ చేసి పుణ్యం క‌ట్టుకున్నాడు. సారైతే చెప్పాడు కానీ మంచి క‌సిమీద కాటేసి పీల్చి పిప్పి చేసేందుకు సిద్ధంగా ఉన్న ప్రైవేట్ పాఠ‌శాల‌ల మేనేజ్‌మెంట్ దీన్ని ఎలా మేనేజ్‌మెంట్లు దీన్ని ఎలా స్వీక‌రిస్తారో? స‌ర్క్యూల‌ర్ తీసి చెత్త బుట్ట‌లో పాడేస్తారో?

మ‌రి మిగిలిన జిల్లాలతో పాటు హైద‌రాబాద్ డీఈవో దీనిపై స్పందిస్తారా? స‌ర్కారుకు ఫిర్యాదు చేసి రాజేష్ పై క‌సితీర్చుకుంటారా?

You missed