నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 4గంటలకే పూజా కార్యక్ర‌మాలు మొదలవుతాయి. 4గంటలకు సుప్రభాతం, 4.30గంటలకు తిరువారాధన, 5గంటలకు బాలభోగం, 4.30గంటలకు గర్భాలయంలోని మూలవర్యులకు నిజాభిషేకం, ఉదయం 6.15గంటలకు తులసీఅర్చన, 7గంటల నుంచి ఉభయ దర్శనాలు మొదలవుతాయి. 8.30గంటలకు నిత్యకల్యాణం, మధ్యాహ్నం 12గంటలకు నివేదన, సాయంత్రం 5గంటలకు నిత్యాలంకార తిరువీధిసేవ, రాత్రి 7గంటలకు ఆరాధన,
7.30గంటలకు తులసీ కుంకుమార్చనలు, ఆంజనేయస్వామికి సహవూసనామార్చనలు, 9గంటలకు ఆరగింపు, 9.45గంటలకు శయనోత్సవం నిర్వ‌హిస్తారు.

కొండపైన గల శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 5గంటలకు రాత్రి 8గంటల వరకు పూజలు కొనసాగుతాయి. పాతగుట్ట గుడిలో … పాతగుట్ట ఆలయంలో నిత్యపూజలు యధావిధిగా నిర్వ‌హిస్తారు. ఆదివారం సోమవారం ఉదయం 5గంటలకు సుప్రభాతం, 5.45 గంటలకు బిందెతీర్థం, 6.15గంటలకు ఆరాధన, ఉదయం 7గంటల నుంచి 8గంటల వరకు దైవదర్శనాలు,
8గంటలకు అభిషేకం, 8.30 గంటలకు అర్చన, మధ్యాహ్నం 12గంటలకు ఆరగింపు, ఉదయం 9.30గంటలకు, 11గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు కొనసాగుతాయి. సాయంత్రం 5.30 గంటలకు అలంకార సేవలు, రాత్రి 7.30గంటలకు నివేదన, 8గంటలకు ఆలయ బంధనం జరుగుతుంది.

యాదగిరిగుట్ట తెలంగాణకు తలమానికమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహుడి దివ్యక్షేత్రం మహిమాన్వితమై విరాజిల్లుతోంది.. యాదగిరీశుడికి పూజలు జరిపితే సకలశుభాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. రాష్ట్ర రాజధానికి అతి చేరువలో వెలసిన యాదగిరిక్షేత్రం కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. యాదగిరీశుడి సన్నిధిలో సత్యనారాయణస్వామి వ్రత పూజలు విశేష సంఖ్యలో జరిపించుకుంటారు. రాష్ట్రంలో అన్నవరం సత్యదేవుడి తర్వాత యాదగిరికొండపైనే అతి ఎక్కువగా సత్యనారాయణస్వామి వారి పూజలు జరుగుతాయి. ప్రతి ఏటా 60 వేలకు పైగా వ్రతాలు జరుగుతున్నాయంటే… ఈ క్షేత్ర విశిష్టత ఏమిటో అవగతమవుతుంది. వ్రత పూజల విశిష్టత రోజు రోజుకు పెరుగుతోంది. ఈ మేరకు వ్రతం కోసం అన్ని హంగులతో కూడిన విశాలమైన మంటపాన్ని ఏర్పాటు చేశారు.

ఈ మంటపంలోసామూహికంగా ఒకేసారి 250 జంటలు వ్రత పూజలు నిర్వహించవచ్చు. భక్తులు కేవలం రూ. 300 చెల్లిస్తే చాలు పూజా సామగ్రిని ఆలయాధికారులు సమకూర్చుతారు. ఉదయం 7.30 గంటలకు, 10 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 4 గంటలకు రోజుకు నాలుగు పర్యాయాలుగా వ్రత పూజలు జరుగుతాయి. సెలవులు, విశేషదినాలలో భక్తుల రద్దీకి అనుగుణంగా అదనంగా వ్రత పూజలు నిర్వహిస్తారు.

నిత్యకల్యాణాలతో కళ కళ..!
నిత్యకల్యాణాలతో యాదగీరీశుడి ప్రాంగణం కళకళలాడుతుంది. నరసింహుడికి భక్తజనులు నిత్యం కల్యాణమహోత్సవం జరిపిస్తూ తరిస్తుంటారు. ఉదయం 8.30 గంటలకు శ్రీవారి కల్యాణ సేవ, హోమం ఉంటుంది. కల్యాణంలో పాల్గొనే భక్తులు రూ. 1,016 రుసుము చెల్లించాలి. కల్యాణోత్సవం జరిపించే భక్తులకు ప్రసాదాలతో పాటు శ్రీవారి శేషవస్త్రాన్ని, ఐదుగురికి అన్నవూపసాదాన్ని అందజేస్తారు.

శ్రీవారికి నిజాభిషేకం..!
శ్రీవారికి అర్చకుల సుప్రభాత సేవ తర్వాత ఉదయం 5.30 గంటలకు నిజాభిషేకం జరుగుతుంది. రూ. 216 రూపాయలు చెల్లించి టిక్కెట్టు తీసుకోవాలి. యాదగిరి నృసింహుడి సన్నిధిన కొలువుదీరిన శ్రీఆండాలమ్మవారికి ఉదయం 8నుంచి 9 గంటల వరకు, సాయంవూతం 4 నుంచి 5 గంటల వరకు కుంకుమార్చన ఉంటుంది. ఈ కార్యక్ర‌మాలలో పాల్గొనే భక్తులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ఇవేగాకుండా ఆలయంలో శ్రీవారికి నిత్యం వెండి జోడు సేవ, అర్చన అష్టోత్తరం, గండదీపం పూజలను జరిపించుకునే అవకాశం కల్పిస్తారు. స్వామివారి సన్నిధిలో భోగాలు జరిపించే అవకాశం కూడా కల్పిస్తారు.

సర్వసేవా పథకం..!
స్వామివారికి ఉదయం సుప్రభాతసేవ నుంచి రాత్రి శయనోత్సవం సేవ వరకు జరిగే అన్ని పూజలలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ దేవస్థానం అధికారులు భక్తులకు ప్రత్యేక ప్యాకేజీ పూజా పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ సర్వ సేవా పథకంలో ఉదయం సుప్రభాతం నిజాభిషేకం అర్చన నిత్యకళ్యాణం సాయంత్రం జోడు సేవలు రాత్రి అర్చన ఆరగింపు, శయయనోత్సవ సేవలలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఇందుకు గాను 2500రూపాయల రుసుము చెల్లిస్తే ఉచిత వసతి, భోజనంతో పాటు స్వామివారి దివ్య ప్రసాదాలైన లడ్డూలు, వడ, పులిహోర, శేషవస్త్రం బహూకరిస్తారు.

మండల దీక్షలు
స్వామివారి సన్నిధిలో మండల దీక్షలు ఎంతో ప్రాచుర్యం కలిగి ఉన్నాయి. స్వామివారిని 40 రోజులు కొలిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కొండపై గల విష్ణుపుష్కరిణిలో స్నానమాచరించి రోజుకు మూడు సార్లు ఆలయంలో భక్తులు ప్రదక్షిణలు చేస్తుంటారు.

అన్నవూపసాదం…
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహుడిని దర్శించే భక్తులకు ఉచిత భోజనం సౌకర్యం కల్పిస్తున్నారు. రోజుకు 500 మందికి టిక్కెట్లను అందజేస్తునారు. అన్నదాన కార్యక్ర‌మంలో శాశ్వత ఉభయుల కోసం భక్తులు రూ. 1,116 రూపాయలు విరాళాలుగా చెల్లించాల్సి ఉంటుంది.

తలనీలాల సమర్పణ…
యాదగిరికొండపై తలనీలాలు సమర్పించుకోవడం భక్తుల ఆనవాయితి. కొండపైగల కల్యాణకట్టలో తలనీలాలను సమర్పించి విష్ణుపుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శిస్తారు. కల్యాణకట్టలో రూ. 10 రూపాయలు చెల్లించి తలనీలాలు సమర్పించుకోవాల్సి ఉంటుంది.

యాదగిరిలో కొలువుదీరిన పరమశివుడు..!
యాదగిరికొడ పైన శివాలయం వేలాది మంది భక్తులతో అలరారుతోంది. యాదగిరికొండ శివకేశవులకు నెలవుగా మారింది. నిత్యపూజలకు తోడు ఒక వైపు శ్రీమహావిష్ణువు, మరో వైపు శివుడు ‘యాదగిరి’ని పునీతం చేస్తున్నారు. యాదగిరిని దర్శిస్తే శివకేశవులిద్దరిని దర్శించే భాగ్యం కలుగుతుండడంతో భక్తులు యాదగిరిగుట్ట దర్శనానికి అధికసంఖ్యలో తరలి వస్తున్నారు.

పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయం
గుట్టకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత పురాతనమైన ఈ దేవాలయాన్ని గుట్ట దేవస్థానం దత్తతకు తీసుకుని అభివృద్ధి చేసింది. ప్రతిరోజు గుట్టను దర్శించిన భక్తులు పాతగుట్టను కూడా దర్శిస్తున్నారు. ఈ దేవస్థానం ఏటా రూ. 60లక్షలకు పైచిలుకు ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

వెంకటాపురం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం
పురాణకాలంలో వెంకటాపురం గిరిపై రుషులు తపస్సు చేసినట్లు, దానికి మెచ్చిన లక్ష్మీనరసింహుడు జ్వాలా రూపంలో వారికి దర్శనమిచ్చినట్లు పురాణాల ఆధారంగా తెలుస్తోంది. వెంకటాపురంలోని ఇరుకైన కొండగుహలో జ్వాలా నరసింహస్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

రాయగిరి వేంక
రాయగిరిలోని వేంక ఆలయాన్ని కాకతీయులు నిర్మించారు. రాయగిరి స్టేషన్ వద్ద గల గుట్టపై శేషశయనంపై కొలువుదీరిన వేంక చూపు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమాన గోపురాన్ని చూపిస్తుంది. విశాలమైన కొలను ఇక్కడి ప్రత్యేకత.

ప్రఖ్యాతి గాంచిన కొలనుపాక జైన మందిరం
కాకతీయుల కాలంలో ప్రసిద్ధినొందిన దివ్యస్థలం కొలనుపాక. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జైనుల ఆలయం తలమానికంగా ఉన్నది. జైనుల రెండో ఆరాధ్య క్షేత్రంగా విలసిల్లుతుండటంతో ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి జైన మతాన్ని విశ్వసించే భక్తులు వస్తుంటారు.

భువనగిరి ఖిల్లా
తూర్పు చాళుక్య రాజైన త్రిభువన మల్లుడు ఏకశిల కొండపై నిర్మించిన భువనగిరి ఖిల్లా చారిత్రక ప్రాధాన్యం సంతరించుకున్నది. కోటను సందర్శనకు రాజధాని నగరం నుంచి విశేష సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. యాదగిరిగుట్టకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండపైన నరసింహస్వామి ఆలయం కొలువుదీరి ఉంది. కొండపైన విష్ణు పుష్కరిణిలోని చేపలకు నామాలు ఉండటం విశేషం. సురేంవూదపురి ఈ మధ్యకాలంలో నిర్మించిన అధునాతన ఆలయాలు, అతిపెద్ద హన్మంతుడు, శివుడి విగ్రహం ఇచ్చట చూడదగ్గది. శిల్పకళకు ప్రసిద్ధి. ఈ పౌరాణిక విజ్ఞాన కేంద్రం సందర్శనకు రూ. 250 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

యాదగిరికి రవాణా సౌకర్యాలు…
హైదరాబాద్‌కు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరిగుట్టకు రావడానికి అక్కడి నుంచి ప్రతి గంటకోసారి బస్సులు ఉంటాయి. ఇవేగాకుండా వరంగల్, హన్మకొండ, మెదక్ జిల్లాల నుంచి విశేష సంఖ్యలో బస్సులున్నాయి. యాదగిరిగుట్ట డిపో నుంచి జిల్లాలోని అన్ని డిపోలకు బస్సులున్నాయి. రైలు ప్రయాణికులు రాయిగిరి రైల్వేస్టేషన్‌లో దిగి ఇతర వాహనాల్లో గుట్టకు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి హైదరాబాద్ మార్గంలో ఈ స్టేషన్ ఉన్నది. దేవస్థానానికి చెందిన మినీ బస్సులు గుట్ట బస్టాండు నుంచి 10 నిమిషాలకోసారి కొండపైకి సిద్ధ్దంగా ఉంటాయి. బస్‌స్టేషన్ సమీపం నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఆటోలు సిద్ధంగా ఉంటాయి. పాతగుట్టకు టాంగా ప్రయాణం మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది.

విష్ణుపుష్కరిణి : యాదున్ని రక్షించిన సుదర్శనుడు… పుష్కరిణిలో స్నానం చేసిన భక్తుల గ్రహబాధలు తొలగిస్తాడని భక్తుల నమ్మకం. బ్రహ్మ శ్రీవారిని సేవించి పాదాలు కడుగగా, ఆ మండల తీర్థమే పుష్కరిణిగా ఏర్పడి మహిమాన్వితమైనదని చరిత్ర చెబుతోంది. బాపట్ల లక్ష్మీకాంతయ్య సంగీత భవనం ఉంది. 150 సంవత్సరాల క్రితం కీ.శే.బాపట్ల లక్ష్మీకాంతయ్య ప్రారంభించిన ధార్మిక సభలు నేడు రాష్ట్రస్థాయికి ఎదిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి కళాకారులు విచ్చేస్తుంటారు. సాహిత్య, సంగీత, నృత్యోత్సవాలు, సంగీత గోష్ఠులు నిర్వహిస్తారు.

సంస్కృత విద్యాపీఠం : 65 ఏళ్ల క్రితం దేవస్థానం ఆధ్వర్యంలో స్థాపించిన ఈ విద్యాపీఠంలో 8వ తరగతి నుంచి డిగ్రీస్థాయి వరకు ఉచిత విద్య, బోధన సౌకర్యం ఉన్నాయి. ఈ పీఠం ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. శ్రీవారి పాదాలు మెట్లమార్గంలో శ్రీవారి పాదాలు దర్శించుకంటే ముక్తిదాయకమని భక్తుల నమ్మకం. శ్రీ నారసింహుడు యాద మహర్షికి ప్రత్యక్షమైన తరువాత వేసిన అడుగులుగా వీటిని చెబుతారు. వీటిని దర్శించుకుంటే ముక్తి దాయకమని భక్తుల నమ్మకం.

గుట్ట గుడిలో విశేషోత్సవాలు…
స్వాతి నక్షత్రం ప్రతి నెల శ్రీస్వామి వారి జన్మనక్షవూతమైన స్వాతి నక్షత్రం నాడు అష్టోత్తర శతఘటాభిషేకం ఆగమశాస్త్ర ప్రకారం జరుగుతుంది. ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు మనోరంజకంగా వేద పండితులు నిర్వహిస్తారు. దీనిలో పాల్గొనడానికి ₹ 351 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అమ్మవారికి ఊంజలి సేవను అమ్మవారికి ప్రతి శుక్రవారం ఊంజలి సేవ నిర్వహిస్తారు. దీనికి గాను రూ. 316 రుసుము చెల్లించాలి. తెప్పోత్సవంను చైత్ర శుద్ద పాఢ్యమి రోజున శ్రీవారు విష్ణు పుష్కరిణిలో ప్రత్యేక అలంకరణల మధ్య విహరిస్తారు.

శ్రీ నారసింహ జయంతిని స్వామి వారి జన్మదినమైన వైశాఖ శుద్ద ద్వాదశి నుంచి చతుర్ధశి వరకు శ్రీ నారసింహ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. అలంకార సేవలు, వాహన సేవల్లో శ్రీవారు తిరువీధులలో దర్శనమిస్తారు. పవివూతోత్సవాలను శ్రావణ శుద్ద దశమి మొదలు ద్వాదశి వరకు ఆలయ పరిరక్షణ పవివూతత కోసం పవివూతోత్సవాలు జరుగుతాయి.

అధ్యయనోత్సవాలు : మార్గశిర శుద్ద దశమి మొదలు పౌర్ణమి వరకు ఆరు రోజుల వైకుంఠ ద్వార దర్శనం, ద్రవిడ పారాయణములు, అన్నకూటోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
శ్రీరామనవమి వేడుకలు : యాదగిరిగుట్ట కొండపై రామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవ వేడుకలు మూడు రోజుల పాటు రమణీయంగా నిర్వహిస్తారు. ఉగాది కవి సమ్మేళనంను తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా కొండపైన ఆస్థాన మండపంలో పంచాంగ శ్రవణం జరుపుతారు. ఈఓల ఇష్టాఇష్టాలను బట్టి కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

 

You missed