సూర్యాపేట
సూర్యాపేట నియోజకవర్గం లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయనకు మద్దతుగా రోజురోజుకు నియోజకవర్గంలో కాంగ్రెస్ బిజెపి నుండి టిఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. దీంతో గులాబీ పార్టీలో నయా జోష్ సంతరించుకుంది. స్వరాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, సూర్యాపేట లో మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వం లో జరిగిన అభివృద్ధికి ఆకర్షితులైన కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా పెన్ పహాడ్ మండలం ధర్మాపురం కాంగ్రెస్ 3వ వార్డు మెంబర్ పిట్టల రామకృష్ణ, యూత్ అధ్యక్షులు చౌగాని సతీష్ గౌడ్, బి జె పి గ్రామ కార్యదర్శి తాడూరి లింగయ్య, చింతకాయల సతీష్, పిట్టల సురేష్, పిట్టల రాజశేఖర్,చింతకాయల నరేష్, అంజయ్య, వెంకటేష్ లు పెన్ పహాడ్ మండలం బక్తలాపురం లో జరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
గులాబీ కండువా కప్పి మంత్రి జగదీష్ రెడ్డి వారికి స్వాగతం పలికారు. మరోవైపు పార్టీ కార్యాలయంలో సూర్యాపేట రూరల్ మండలంఆరెగూడెం వార్డ్ మెంబర్ సిరపంగి సరిత, మధు, అజిత, గీత, వెంకటేష్, ముత్యాలు, రామదాసు, రాంబాబు, శ్రీను, రాములమ్మ, యాకూబ్, ప్రమీల, కవిత, రజిత,తదితరులు కాంగ్రెస్కు రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరారు. జడ్పిటిసి జీడి బిక్షం, మండల అధ్యక్షుడు రంగాల శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో మంత్రి జగదీశ్ రెడ్డి గారి వ్యక్తిగత సహాయకులు ప్రభాకర్ రెడ్డి గులాబీ కండువా కప్పి నూతనంగా వచ్చిన వారిని ఆహ్వానించారు..