సూర్యాపేట

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సతీమణి సునీత జగదీశ్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. సూర్యాపేట పట్టణంలోని 31వ వార్డులో కౌన్సిలర్, మహిళా ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. టిఆర్ఎస్ మేనిఫెస్టోను వివరిస్తూ ఆప్యాయంగా పలకరించారు.

. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని తొమ్మిదిన్నర ఏండ్లలో చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు. ప్రజల శ్రేయస్సుకు, రాష్ర్టాభివృద్ధికి ఎంతో ముందుచూపు ఆలోచనతో సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వివరించారు. ప్రజా సంక్షేమ పథకాలు, సూర్యాపేట అభివృద్ధి ఎవరూ చేశారో ప్రజలకు తెలుసని అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ మరింత అభివృద్ధిని సాధించాలంటే ఎమ్మెల్యే గా జగదీష్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
గడపగడపకూ వెళ్లి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. వార్డుల్లో కదిలిన గులాబీదండుతో వార్డులు గులాబీమయంగా మారాయి.

You missed