దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

అధికార పార్టీ హవా జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. సీనియర్‌ లీడర్‌, బోధన్‌ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి మంత్రి కాకముందే మంత్రి అధికారులకు హుకూం జారీ చేసేస్తున్నాడు. తాజాగా ఆర్మూర్‌ నియోజకవర్గ అధికారులతో ఆయన మీటింగు పెట్టించాడు.ఈ మీటింగులో అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. ఎవరికి ఏం కావాలన్నా, ఎవరేం చేయాలన్నా తనకు తెలియాలన్నాడు. తనకు చెప్పాలన్నాడు. ఇక్కడ షాడో ఎమ్మెల్యేగా వినయ్‌రెడ్డి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఎలాగూ త్వరలో సుదర్శన్‌రెడ్డి మంత్రి కాబోతున్నాడనే ప్రచారం ఊపందుకున్నది. హోం శాఖ ఇస్తారని కూడా చెప్పుకుంటున్నారు.

ఈ క్రమంలోనే సుదర్శన్‌రెడ్డి జిల్లాపై ఇప్పట్నుంచే పట్టుపెంచుకునేందుకు రంగం సిద్దం చేసుకున్నాడు. ఆర్మూర్‌, అర్బన్‌, బాల్కొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఓడింది. ఆర్మూర్‌, అర్బన్‌లో బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలవగా, బాల్కొండలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గెలిచాడు. కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఓడిన ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులు షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. తాము చెబితే వినడం లేదని కాబోయే మంత్రి సుదర్శన్‌రెడ్డిని రంగంలోకి దింపారు. ఇందులో భాగంగానే ఆర్మూర్‌ నియోజకవర్గ అధికారులతో సుదర్శన్‌రెడ్డి మీటింగు పెట్టి అల్టిమేటం జారీ చేశాడు.

ఆ తరువాత బాల్కొండ. అటు పిమ్మట నిజామాబాద్‌ అర్బన్‌. మరోవైపు పోలీస్‌ శాఖపై కూడా పట్టుబిగుస్తున్నాడు సుర్శన్‌రెడ్డి. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్‌ పంజాగుట్టలో చేసిన కారు యాక్సిడెంట్‌ కేసులో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌పై సీరియస్‌గా యాక్షన్‌ తీసుకునేలా సుదర్శన్‌రెడ్డి, శరత్‌రెడ్డిలు సఫలీకృతులయ్యారు.

 

You missed

అర్వింద్‌ ‘పసుపు’ రాజకీయం.. మళ్లీ తెరపైకి బాండుపేపర్.. రెండేండ్లలో టన్నుకు 20వేలు ఇస్తానని ప్రకటన… మళ్లీ అవే ‘బాండ్‌’ అబద్దాలతో ఎంపీ రైతుల చెవిల్లో పసుపు… ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. ప్రస్తుతం పసుపు క్వింటాళ్‌కు 14వేల పై చిలుకు ధర పలుకుతున్న వైనం.. ఎందుకు ఇంత రేటు పెరిగిందో తెలియని నేతల అవగాహనారాహిత్యం.. 70వేల ఎకరాల నుంచి సాగు విస్తీర్ణం సగానికి పడిపోయిన వైనం.. పెరిగిన ఎగుమతి డిమాండ్.. చాలా మంది రైతులు పసుపు పండిచేందుకు వెనుకడుగు.. దీనికి ఎవరు కారణం.. ? పసుపుబోర్డు తెస్తానని ఐదేండ్లు కాలయాపన చేసి ఫలితంగా పసుపు ‘సాగు’ బంగారమయిన దుస్థితి.. రేవంత్‌ కూడా బీజేపీకి మైలేజీ ఇచ్చేలా అవగాహనారాహిత్యపు ట్వీట్‌… మళ్లీ బాండ్‌ పేపర్‌ రాస్తానని బరితెగించిన చెప్పిన అర్వింద్.. కానీ బీఆరెస్‌, కాంగ్రెస్‌ నేతల్లో చలనం లేని రాజకీయ నిస్తేజం.. ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌….