దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

మహాలక్ష్మి పథకానికి మహిళలు మంగళ హారతులు పట్టారు. ఆరు గ్యారెంటీలకు నేటితో చివరి తేదీ కావడంతో ఇప్పటి వరకు అంతటా అద్బుత స్పందన లభించింది. ఇప్పటి వరకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. శనివారంతో ఈ కార్యక్రమం ముగియనుంది. ఆ తరవాత మిగిలిపోయిన వారి దరఖాస్తులు ప్రజావాణి, తహసీల్దార్‌ కార్యాలయాల్లో స్వీకరిస్తారు. ఐదు రోజుల్లో నిజామాబాద్‌ జిల్లాలో 4, 30, 192 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు మరో ముప్పైవేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో మొత్తం 5 లక్షల అప్లికేషన్లకు ఈ సంఖ్య చేరనుంది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో మొదటి స్థానం మహాలక్ష్మి పథాకానిది కాగా. రెండో స్థానం రైతు కూలీ కింద ఏడాదికి ఇస్తామన్న పన్నెండు వేల కోసం బారులు తీరారు.

ఆ తరువాతి స్థానం ఇందిరమ్మ ఇండ్లకు దక్కింది. ఇంటి స్థలం ఉన్న ఉన్నవాళ్లు ఐదు లక్షల ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇంటి స్థలం కూడా లేని వాళ్లు ప్రభుత్వ స్థలాలు ఇస్తారనే ఉద్దేశంతో అప్లికేషన్లు ఇచ్చారు. శుక్రవారం నుంచి ఈ దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో ఎక్కిస్తున్నారు. ఈ నెల 17 వరకు ఈ ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి చేస్తామని, ఆరు గ్యారెంటీలకు అద్బుత స్పందన వచ్చిందని నిజామాబాద్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి తెలిపారు.

You missed