దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి:

ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తానంటున్నాడు రేవంత్‌. చనిపోయిన ఉద్యమకారుల కుటుంబాలకు నెలకు 25 వేల పింఛన్‌ ఇస్తానంటున్నాడు. ఆరు గ్యారెంటీల్లో ఇదీ ప్రధానం స్కీంగా పెట్టాడు. దీంతో మిగిలిన గ్యారెంటీలకు ఎలా భారీ స్పందన వచ్చిందో.. అదే స్థాయిలో ఈ స్కీంకూ స్పందన రావడమే కాదు.. రేవంత్‌కు జేజేలు పలుకుతున్నారు కట్టర్‌ బీఆరెస్‌ నేతలు కూడా. అవును.. పదేళ్లు టీఆరెస్‌ ప్రభుత్వంలో అంతకు ముందు ఐదు పదేళ్లు ఉద్యమంలో జీవితాన్నే కోల్పోయిన తమకు కేసీఆర్‌ ఎలాంటి గుర్తింపు నివ్వకపోగా.. కనీసం పట్టించుకోలేదని మనోవేదన వారిని పీడిస్తూ వచ్చింది.

అదలా ఉండగానే ఇప్పుడు రేవంత్‌ వారిని ప్రత్యేకంగా చూడటం, గుర్తింపునిస్తూ పథకాలు అందించేందుకు దరఖాస్తులు తీసుకోవడాన్ని ఆత్మగౌరవంగా భావిస్తున్నారు ఉద్యమకారులు. మంగళవారం సీపీ కల్మేశ్వర్ షింగినేవార్‌ను కలిసి విద్యార్థి ఉద్యమ జేఏసీ నాయకులు తమ కేసులు వివరాలు అందించాలని వినతిపత్రం సమర్పించడం ప్రాధాన్యత సంతరించుకున్నది. వాస్తవంగా ఉద్యమకారులంతా దాదాపుగా బీఆరెస్‌నే అంటిపెట్టుకుని ఉన్నారు. పదేళ్ల పాటు ఆశగా ఎదురుచూస్తు వచ్చారు. కాలయాపన జరిగినా.. గుర్తింపు లేకపోయినా ఓపిక పట్టారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు కేసుల వివరాలు అడుగుతున్నది ఆరు గ్యారెంటీల్లో భాగంగా తమకు 250 గజాల స్థలం ఇవ్వమని, దరఖాస్తు చేసుకోగానే వారిచ్చేశారని కాదు వీరికి సంతోషం. కనీసం గుర్తించారని, దరఖాస్తులైన తీసుకుంటు తమ ఉనికిని, ఆత్మగౌరవానికి ప్రాధన్యత ఇచ్చారు. కేసీఆర్‌ సర్కార్‌ హయాంలో అదే జరగలేదనేది వీరి అసంతృప్తికి, మనోవేదనకు ఆగ్రహావేశాలకు మూలకారణం.

You missed