సీఎం కేసీఆర్‌ ఫార్మూలాను కాంగ్రెస్‌ కూడా అమలు చేస్తోంది. అదేమంటారా..? కేసీఆర్‌ను కామారెడ్డి నుంచి పోటీ చేయిస్తే కామారెడ్డి జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలపై కూడా దీని ప్రభావం ఉంటుందనేది అధినేత ఆలోచన. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే చేయబోతున్నది. కేసీఆర్ పై పోటీకి రేవంత్‌ను దింపితే గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా జిల్లాలోని మిగిలిన నియోజకర్గాలపై ఆపై చుట్టుపక్కల జిల్లాలపైనా ప్రభావం చూపి కాంగ్రెస్‌ అభ్యర్థులకు కలిసి రావచ్చనే భావనలో అధిష్టానం ఉంది. దీంతో రేవంత్‌ను కామారెడ్డి బరి నుంచి దింపేందుకు ఇక డిసైడ్‌ అయిపోయినట్టు తెలిసింది.

నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి షబ్బీర్‌ను పోటీలోకి దింపుతున్నారు. ఇక్కడ అర్బన్‌ కాంగ్రెస్‌లో పూర్తి నైరాశ్యం ఉంది. ఆకుల లలిత రాకను గట్టిగా అడ్డుకున్నా ఆమె ఏఐసీసీ ప్రెసిడెంట్‌తో పార్టీ కండువా కప్పించుకోవడాన్ని ఎవరూ జీర్ణించుకోవడం లేదు. పైగా అర్బన్‌ టికెట్‌ ఆమెకు ఇస్తారని జరుగుతున్న ప్రచారాన్ని కూడా తట్టుకోవడం లేదు. ఈ క్రమంలో షబ్బీర్‌ను అర్బన్‌ నుంచి పోటీకి దింపితే అర్బన్‌తో పాటు జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ప్రభావం ఉంటుందనే భావనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది.

అర్బన్‌ నేతలు సైతం హార్ట్‌ఫుల్‌గా షబ్బీర్‌ గెలుపు కోసం పనిచేసే చాన్స్‌ ఉందనే అంచనాకొచ్చారు. ఆకుల లలిత రాకతో మున్నూరుకాపుల ఓట్లు కూడా కాంగ్రెస్‌కు మైలేజీని ఇచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు దాదాపు ఓ క్లారిటీ నిర్ణయానికి వచ్చినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. ఇవాళ ఆదివారం సాయంత్రం నాటికి వీటిపై క్లారిటీ ఇస్తూ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.

You missed