నిజామాబాద్‌ అర్బన్‌ కాంగ్రెస్‌ రాజకీయం సెకండ్‌ లిస్టునే ఆపేలా చేసింది. నరాలు తెగే ఉత్కంఠను కల్పిస్తున్నది. సీఎం కేసీఆర్‌ కామారెడ్డి బరి నుంచి పోటీ చేసేందుకు సిద్దమైన సందర్భం నుంచి పరిస్థితులు పూర్తిగా మారాయి. షబ్బీర్‌ అలీని అర్బన్‌ నుంచి పోటీ చేయాల్సిందిగా అధిష్టానం సూచించింది. సర్వే చేయించింది. అయితే ఆ సర్వే రిపోర్టులో షబ్బీర్‌కు అనుకూలంగా రాలేదు. దీంతో షబ్బీర్‌ తర్జన భర్జన పడుతున్నాడు. కామారెడ్డి నుంచి రేవంత్‌ రెడ్డి పోటీ చేయించాలని భావించినా.. మళ్లీ పునారాలోచనలో పడింది. నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో ఇద్దరు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావించింది.

ఇందులో ఆర్మూర్‌, అర్బన్‌ నియోజకవర్గాలు ఎంచుకున్నది. ఆర్మూర్‌ వినయ్‌ రెడ్డికి ఇవ్వడంతో ఇక మిగిలింది అర్బనే. కానీ సీఎం కేసీఆర్‌ కామారెడ్డి కి వస్తుండంతో షబ్బీర్‌ను వేరే చోటికి పంపాలనే ఏఐసీసీ ఆలోచనతో ఫస్ట్‌ లిస్టులో అతని పేరు రాలేదు. అర్బన్‌లో అయితే మైనార్టీలు ఎక్కువగా ఉంటారని అక్కడ గెలుపు సులవవుతుందని భావించారు. దీనికి తోడు మున్నూరుకాపుల బలం కూడా కావాల్సి ఉండటంతో ఆకుల లలితను చేర్చుకున్నారు. కానీ షబ్బీర్‌కు సర్వే రిపోర్టు పాజిటివ్‌గా రాలేదు. దీంతో బీసీకి ఇవ్వాలనే ఆలోచనను మళ్లీ తెరపైకి తెచ్చారు. దీంతో అర్బన్‌లో బలంగా ఉన్న మున్నూరుకాపుల్లో సంజయ్, ఆకుల లలిత పేర్లు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

వీరిద్దరిలో ఎవరికి ఇవ్వాలనేది ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. సుదర్శన్‌రెడ్డి సహా మిగిలిన వారంతా ఆకుల లలిత రాకను అడ్డుకున్నారు. ఎట్టకేలకు ఆమె ఏఐసీసీ ప్రెసిడెంట్‌ చేతుల మీదుగా పార్టీలో చేరారు. ఇప్పుడు టికెట్ కోసం లాబీయింగ్‌ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో మళ్లీ సంజయ్‌ పేరు, ఆకుల లలిత పేర్లు తెరమీదకు వస్తున్నాయి. మహేశ్ కుమార్‌ గౌడ్‌ ఈ పోటీ నుంచి ఎప్పుడో తప్పుకున్నాడు. మున్నూరుకాపులకు ఒక టికెట్ ఇవ్వాలని అధిష్టానం బలంగా యోచిస్తున్న సమయంలో వీరిలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలనే కచ్చితమైన నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే సెకండ్ లిస్టును ఆపేసింది.

కాగా నిజామాబాద్‌ రూరల్‌ నుంచి భూపతిరెడ్డిని, ఎల్లారెడ్డి నుంచి మదన్‌మోహన్‌ అభ్యర్థిత్వాన్ని మాత్రమే అధిష్టానం సెకండ్‌ లిస్టులో ఫైనల్ చేసింది

You missed