కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడమోమో గానీ కొంత మంది నేతలకు మాత్రం హీరోలను చేస్తున్నాడు. అందులో ముందు వరుసలో ఉన్నది బీజేపీ నేత కాట్‌పల్లి వెంకటరమణా రెడ్డి. సహజంగా బీజేపీ గ్రాఫ్ అంతటా పడిపోయింది. కానీ కామారెడ్డిలో రమన్‌రెడ్డి వ్యక్తిగతంగా రాజీకయంగా ఎదిగాడు. అన్ని వర్గాలను కలుపుకుని పోతున్నాడు. బీజేపీ వల్ల రమణారెడ్డికి ఉపయోగం లేదు… రమణారెడ్డి వల్లే అక్కడ బీజేపీ గ్రాఫ్ లేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా కేటీఆర్ కార్యకర్తల సమావేశంలో గంటకు పైగా మాట్లాడాడు. గ్రూపులు మెంటేన్ చేస్తున్న నేతలకు చురకలంటించాడు. కర్తవ్యబోధ చేశాడ. ఉచితోపదేశం వల్లెవేశాడు. కానీ నేతల తీరు మారలే.
లోకల్ ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఫోటో లేకుండా మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, నిట్టు వేణుగోపాల్ ఎన్నో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి మళ్లీ రచ్చ రాజకీయాలకు తెర లేపాడు. సరే ఇదంతా ఒకెత్తు. ఆ తర్వాత రోజు బీజేపీ కామారెడ్డి క్యాండిడేట్ కాట్‌పల్లి వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి.. తాను కేసీఆర్‌ను ఇక్కడ ఓడించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చాలెంజ్ చేశాడు. ఇదీ అసలు హీరోయిజం అంటే. ఇదీ అసలు సిసలైన రాజకీయమంటే. గంప గోవర్దన్ తోపాటు కేటీఆర్‌కూ ఈ సవాల్ ఈటెలా గుచ్చుకున్నది. అవును.. మరి.. ! కేసీఆర్ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గం నుంచి బ్రహ్మండమైన మెజారిటీ కోసం ఊరికో మ్యానిఫెస్టో రెడీ చేసుకుంటున్న కేటీఆర్‌కు.. కేసీఆర్‌ను ఓడిస్తా చూడు… లేదంటే రాజకీయ సన్యాసం చేస్తానని చాలెంజ్ విసరడం మామూలు విషయం కాదు. అంటే కామారెడ్డి బీఆరెస్‌లో నేతల మధ్య ఎంతటి సమన్వయ లోపం ఉందో ఈ కామెంట్ బహిర్గతం చేస్తున్నది.
బీఆరెస్ పార్టీకి, కేసీఆర్‌పైనా ఎంతటి వ్యతిరేకత ఉన్నదో కూడా ఈ చాలెంట్ నిదర్శనంగా నిలుస్తున్నది. కేటీఆర్ దేశానికి మనం మార్గదర్శనం కావాలని ఇక్కడి నుంచి పిలుపునిస్తే.. మిమ్మల్ని ఓడించి చూపిస్తానని రమణారెడ్డి తొడలు చరిచి సవాల్ విసరడం మామాలు విషయం కాదు.. నిజంగా ఆడు మగడ్రా బుజ్జీ…! అనుకునే రేంజ్ సవాల్ అది…