ఎన్నికల కోడ్ కొంపముంచుతుందని తెలుసు. ఏన్నాళ్లుగానో జర్నలిస్టులు ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్నారనీ తెలుసు. ఏదో గుండారం గుట్టలో.. రాళ్లు రప్పలో ఏదో ఒకటి అని అడ్జస్ట్ అయిపోయి .. పట్టాలు చేతికెప్పుడందుతాయని ఎదురుచూస్తున్న తరుణంలో నేడో రేపో అని మోచేతికి బెల్లం పెట్టి మరీ ఎదురుచూపులు చూసేలా చూసీ తీరా ఇలా… కోడ్ వచ్చే వరకు జాప్యం చేసి.. మేమేం చేస్తాం.. కోడ్ వచ్చిందిగా అని చల్లగా జారుకున్నారు మన నేతలు. మళ్లీ మనమే వస్తాం.. అప్పుడిస్తాం అని చావు కబురు చల్లగా చెప్పారు. పాపం.. ఇందూరు జర్నలిస్టులు.. నోరు లేని మూగ జీవులు. ఏమీ చేస్తారు…. చూస్తూ మూగగా అరణ్య రోదన చేయడం తప్ప. మరో ఐదేళ్లు ఆగాలి కాబోలు.
ఆ పాటికి ఓపిక తెచ్చుకోవాలని బ్రదర్.. తప్పుదు… మనకు అలవాటే కదా… ఎదురుచూడ్డం.. ఆశాజీవులుగా జీవించడం.. అల్ప సంతోషులుగా బ్రతుకులు వెళ్లదీయడం.. కుటుంబం రోడ్డున పడ్డా డాబు దర్పం చూపించడం.. అలాగే బ్రతికేద్దాం.. మరో ఐదేళ్లు.. పాట్లు వస్తాయని ఆశతో.. ఇస్తారనే అత్యాశతో…