ఎన్నో ఊహాగానాలు.. ఆర్మూర్‌ నుంచి అర్విందే పోటీ చేస్తాడని. కానీ ఆ ప్రచారానికి తెర దించాడు రాకేశ్‌రెడ్డి. పార్టీలో ఇటీవల చేసిన రాకేశ్‌రెడ్డి ఆర్మూర్‌ నుంచి పోటీ చేయాలనుకున్నాడు. కానీ అర్విందే బరిలో ఉంటాడనే ప్రచారం నిన్నటి వరకు సాగింది. దీంతో తీవ్ర అయోమయ పరిస్థితి ఉండేది ఆర్మూర్‌ రాజకీయంలో. ఈ క్రమంలో జీవన్‌రెడ్డి ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత తన ప్రసంగంలో ఆర్మూర్‌ నుంచి బీజేపీ, కాంగ్రెస్‌లో తమ అభ్యర్థులను ప్రకటించలేకపోతున్నాయని ప్రశ్నించారు.

దీంతో శనివారం మాక్లూర్‌ మీటింగులో రాకేశ్‌రెడ్డి తనకు తానే ఆర్మూర్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటున్నానని, ఆశీర్వదించాలని ప్రకటించేసుకున్నాడు. దీంతో ఇది చర్చనీయాంశమైంది. పార్టీ విధానాలు, సిద్దాంతం ప్రకారం.. ఎవరు ఎక్కడ నుంచి పోటీ అనేది అధిష్టానం చెప్పే వరకు అంతా గోప్యమే. కానీ ఇక్కడ అంతా అర్వింద్‌ హవా నడుస్తోంది. తను అనుకున్న వారికే టికెట్‌ ఇప్పించుకునేందుకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి తన అభ్యర్థులను పార్టీ నుంచి ప్రచారంలో ఉంచాడు.

కానీ అర్వింద్‌కు ఆర్మూర్‌పై ఆశ ఉందనే ప్రచారం జోరుగా సాగింది. కవిత ఆర్మూర్‌ ర్యాలీతో రాకేశ్‌రెడ్డి తన పేరును ప్రకటించుకోవడం అనివార్యంగా భావించాడు. దీనికి అర్వింద్‌ కూడా ఓకే చెప్పినట్టున్నాడు. దీంతో తానే పోటీ చేస్తున్నానని చెప్పేసుకున్నాడు. ఇలా తనకు తాను ప్రకటించుకునే అవకాశం సొంతగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. పై నుంచి ఓ కమిట్‌మెంట్ ఉంటే తప్ప. మరి ఇదే నిజమైతే అర్వింద్‌ ఎక్కడ్నుంచి పోటీ చేస్తాడు. కోరుట్ల ను ఎంచుకుంటాడా..? మారిన పరిస్థితుల నేపథ్యంలో అసలు ఎమ్మెల్యే పోటీ చేయకుండానే వెనుకంజ వేస్తాడా..? అనేదే ఇప్పుడు చర్చకు వస్తోంది. క్యాడర్‌లో మాత్రం తీవ్ర అయోయమం కొనసాగుతోంది. బీజేపీ హవా తగ్గుతోంది. మూడు నెలల కిందట ఉన్న రాజకీయ పరిస్థితులు ఇప్పుడు లేవు. దీంతో ఎమ్మెల్యేగా పోటీ చేసి చిత్తుగా ఓడి ఇజ్జత్‌ తీసుకునే బదులు… సైలెంట్‌గా ఎంపీగానే బరిలో ఉంటే మోడీ మాయ ఏమైనా గట్టెక్కిస్తుందా..? అనే ఆలోచనలో ఉన్నాడట ఎంపీ అర్వింద్‌.

You missed