కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేస్తున్న నేపథ్యంలో తొలిసారి స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ నేతృత్వంలో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బీబీపేటలో 28 (సోమవారం) సభ ఏర్పాటు చేయాలని భావించారు. కానీ దీన్ని వాయిదా వేసినట్టు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌ తెలిపారు. తొలిసారి మీటింగు కావడం.. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి భారీ సభ నిర్వహిస్తేనే బాగుంటుందనే పార్టీ శ్రేణుల సూచన మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

కానీ తేదీని ఇంకా ప్రకటించలేదు. వచ్చే నెల 3న గంప గోవర్దన్‌ తనయుడి వివాహం ఉంది. ఈ వివాహ ఏర్పాట్లలో ఆయన బిజీబిజీగా ఉన్నారు. దీంతో భారీ బహిరంగ సభకు లోకల్‌ ఎమ్మెల్యే సమయం కేటాయించి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇది కుదరేలా లేదు. దీంతో గంప తనయుడి వివాహం తర్వాతే బహిరంగ సభకు ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.

You missed